పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

13

   తర్వాత  శ్రీనాథమూర్తి పాశ్చాత్యుల  ఆశయవాదం  అంటే ఏమిటో  స్పష్టం  చేశాడు.  ఆశయవాదంలో పాశ్చాత్యులకు  మూడు భేదాలున్నాయి  సాదారణ లౌకికం, వేదాంతపరం, లలితకళా పరమున్నూ. లౌకికపరమైన అర్ధం  ప్రతి  విషయమూ  సంపూర్ణత  పొందడం, ప్రజారాజ్యం  అంటే  నిజమైన  ప్రజారాజ్యంగా ఉండడం.  ఇంక వేదాంతపరంగా  ఉన్న  భావం ఏమిటంటే, భావమూ, వస్తువూ ఒకదాని కొకటి  అత్యంతాంతరింగిక సంబంధం  కలవి అన్న వాదన. మనుష్యుని  జ్ఞానం  లేక వస్తువు లేదు  అన్న వాదన. ఈ వాదన  మన  జ్ఞాన  మార్గానికి  సన్నిహిత సంబంధం  కలిగి ఉంటుందనుకుంటాను. ఈ వాదానికి  వ్యతిరేకం  వస్తువు  వేరు, మనుష్య జ్ఞానం  వేరు  అన్న  వాదన.                                                                                                                            
           
               

ఇంక లలితకళా విషయంలో ఆశయవాదం ప్రాపంచకంగానే ఉంటుంది. భౌతిక సత్యం ఇల్లా ఉండాలని ఊహించి, ఆ సత్యానికి సన్నిహితమైన రూపం ప్రకృతిలో వెదికి, దానిని నిరూపించడం ఆశయ వాదం. ఈ ఆశయవాదం ఇంకో రకమూ వుంది. భగవంతుని శక్తి ప్రకృతిలో వుందనీ, అది కళాస్వరూపం చేయడంలో వర్ణాలకలయిక , రేఖలసామ్యత మూర్తుల విన్యాసమూ, కర్మశాంతతా ఇవన్నీ జాగ్రత్తగా పాటించాలని చెబుతుందనీ, రస్కిను మొదలగువారు వాదిస్తారు.

   శ్రీనాథమూర్తి  భౌతికసత్యం  కళకు  జీవమన్న పాస్చాత్యవాదనను  గూర్చి  వర్ణించాడు. వాస్తవిక  జగత్తు  మానవభావ  రహితమై  ఈ  స్థితిలో  వుటుందని మనుష్యుడు  విచారణ చేసి  కునుక్కోవాలట. అది కళా స్వరూపంగా  సృష్టించాలట. త్రివిష్టపసన్యాసు లీతని  అభిభాషణ  అంతా శ్రద్దగా ఆలకించారు. ఆ  విషయం  అతడు  పూర్తిచేసేటప్పటికి  రాత్రి  పన్నెండు గంటలయినది. ఆ తర్వాత  అందరమూ విశ్రమించడానికి లేచాము.
   ఆ మర్నాడు  శ్రీనాథమూర్తి  నా దగ్గరకు వచ్చి  పాదాభివందనం చేసి,  గురుదేవా, నిన్న నేను  పాశ్చాత్యభావాలు  తమ కందరికీ  విన్నవించి  వెళ్ళిన తర్వాత,  నా కెంతసేపటికీ  నిద్రపట్టలేదు. లేచి సహస్రముఖ బుద్దదేవ  చైత్యమందిరానికిపోయి, ఆ విగ్రహం ఎదుట  పద్మాసనం వేసి  కూర్చుండి  మినుకు మినుకుమనే  ఆ  దీపాలకాంతిలో ఆ విగ్రహమహాభావం,  సౌందర్యం  అవలోకిస్తూ, ఏదో  ఆనందంలో  మునిగిపోయివుంటివి.
    ఇంతలో  ఆ విగ్రహం  మాయమై  కైలాసపర్వతం  దర్శనమైనది. అప్పుడే  ఒక మహాభావం  నాకు వినబడినట్లయింది.  మూర్తీ!  భారతీయ కళావిధానం ప్రాచ్యతెండవాసుల సౌందర్యదర్శనాధారం. కాలాతీతమై, వ్యక్తిగత మూర్త్యతీతమైన భావాన్ని  నిరూపించి  భారతీయ కళ. నూత్నాశయాలు, భావాలు సంప్రదాయంలో విన్యాసంచేయి, ప్రకృతిని ఆధారం చేసుకో. దేహం, మనస్సు,