పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చిత్తం, ప్రథమంలో మనుష్యుడు తన చుట్టూవున్న ప్రకృతిలోని రంగులు మోస్తరు, తనకు దొరికిన రంగు మన్నులు, రంగు పూవులు మొదలైన ఉపకరణాలతో ప్రకృతిలోని రూపాలను, ప్రకృతిలోని రంగులను అనుకరిస్తూ తానున్న గుహల గోడలపై జంతువుల బొమ్మలు, జంతువులను, మనుష్యులు వేటాడే బొమ్మలు వేసేడు. మట్టితో జంతువుల, మనుష్యుల బొమ్మలు చేశాడు. ప్రకృతిలోని ధ్వనులు అనుకరిస్తూ సంగీతం పాడాడు. గంతులు వేశాడు. భాష కల్పించుకున్నాడు. ఆ భాషతో తనలో కలిగిన ఆనందాన్ని వెలిబుచ్చాడు. అది ప్రాథమిక కావ్యమయింది.

   ఒక టిబెట్టులామా నెమ్మదిగా  మనుష్యుడు  దేవతలతో  నుండి  వుద్భవింపలేదా?  అని  ప్రశ్నించాడు.
   ఈ  బాలకుడు  చెప్పే మాటలు  పాశ్చాత్యుల భావాలు  మాత్రం.  అవి  తామందరూ  విని  తర్వాత  నా  మాటలు  విని  ఈతనికి  తమ కళలు  నేర్పేందుకు  అనుమతించాలని  నా  ప్రార్ధన! అని  నేనా లామాకు  మనవి చేశాను.  ఆయన ఊపాడు,  శ్రీనాథమూర్తీ,  నువ్వు కానీ! అన్నాను.
    లలితకళ అంటే  మనుష్యుడు  సౌందర్యాన్ని  సందర్శించినప్పుడు, ఆ  సౌందర్యానందం, చిత్ర, శిల్ప, శబ్ద, స్పందన  రూపాలుగా  సృస్టించడమే. లలితకళా, చిత్రశిల్పాలు  దృశ్యకళలు, సంగీత కవిత్వాలు శ్రవ్యకళలు. నాట్యం  దృశ్యశ్రవ్యకళ, లలితకళలు ప్రకృతి  సందర్శన స్మృతులవల్లా, మానవ జీవిత  సందర్శన  స్మృతులవల్లా వచ్చినవి గనుక,  ఆ కళలు  ప్రకృతికీ, మానవునికీ సన్నిహితంగా  వుండాలి అంటారు. కాబట్టి  పాశ్చాత్య కళాకారులలో చాలామంది భౌతిక  సత్యవాదులు. ఈ కైలాసం  సృష్టించాలంటే, కైలాసం ఎక్కువ  అందంగా  కనబడేకాలంలో అంటే  ఈ రుతువు, ఈ మాసం, ఈ రోజు  ఈ సమయంలో  ఒకానొక  వైపునుంచి చిత్రం వేస్తారు. అందుకనే  పాశ్చాత్యుల  కళ ఎప్పుడూ నూత్న  మార్గాలు  అన్వేషిస్తూనే  ఉంటుంది.  పాశ్చాత్యుల  కళ  దినదినమూ, మార్గం  అధిగమించిన కొలదీ, వృద్ది అవుతూన్న కళ.  ప్రకృతిని  సరిగా  అనుకరించాలన్న ప్రయాసతో  వివిధ విధానాలు వచ్చాయి. అదే  భౌతిక  సత్యవాదము (రియలిజం).  మూల సత్యవాదము (ఇంప్రెషనిజము), అఖండమూల సత్యవాదము (పోస్టుఇంప్రెషనిజము), అతి వాస్తవికత(సర్ రియలిజం)మొదలైనవి.
   నేను అప్పుడు  శ్రీనాథమూర్తిని చూచి,  భౌతికసత్యాన్ని  అనుకరించడమే మొదటినుంచీ  పాశ్చాత్య  చిత్రకారుల  కృషి అంటివి.  పారలౌకిక  సత్యాన్ని  అనుసరించాలని పాశ్చాత్యాదేశాల్లో  ప్రయత్నం జరగలేదా? అని ప్రశ్నించాను.
   అతడు నన్ను  చూచి స్వామీ, అలాంటి ప్రయత్నాలు  చాలా మాట్లు జరిగాయి.  గాని  అవి  పారలౌకికం  అని చెప్పలేము. అవన్నీ భౌతిక  సత్యవాదానికి వ్యతిరేకంగా వచ్చినవే.  మన దేశంలోని  ఆధ్యాత్మిక భావజనితమైన  ఆదర్శ  వాదానికీ, పాశ్చాత్యుల  ఆదర్శ  వాదానికీ (ఐడియలిజం)చాలా తేడా ఉందనుకుంటాను అన్నాడు.