పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

11

   ద్యూపాంగు సంఘారామం  ఆంధ్ర  శాతవాహన సామ్రాజ్య రాజధానీ నగరమైన  ధాన్యకటక  సఘారామం  పేరున  నెలకొల్పబడింది. ద్యూపాంగు  అంటే  టిబెట్టు  భాషలో  ధాన్యకటకం  అని అర్ధం. ద్యూపాంగు  బహుశః  ఆరవశతాబ్దంలో భారతీయులైన  బౌద్దసన్యాసులు  టిబెట్టు  వలస బోయి అక్కడ నెలకొల్పి  వుంటారు.  ఆంధ్ర మహాయాన  బౌద్ద  సంప్రదాయం  ఇక్కడ  నుండే టిబెట్టు అంతా  ప్రసరించింది.  ఆంధ్రశిల్ప చిత్రలేఖన సంప్రదాయాలు  ఇక్కడ నుండే త్రివిష్టప్రదేశం  అంతా  శాఖలల్లుకుపోయినవి. అనేక ఆంధ్ర  గ్రంథాలు తిబెత్తుభాషలో  అనువదించబడ్డాయి. అవన్నీ ద్యూపంగు  సంఘారామంలో వున్నాయి.  మా అద్వైత్వానికి  పనికి వచ్చే  గ్రంథాలెన్నో త్రివిష్టప భాషలో  వున్నాయి అక్కడ.
   శ్రీనాథమూర్తి శిల్పి, చిత్రకారుడు, కవి. చక్కని కంఠంతో  తాను  రచించుకొన్న పాటలు  పాడగలడు. ముఖ్యంగా శిల్పి  పాశ్చాత్య విధానంలో  అందమైన  బొమ్మలెన్నో  మైనంతో  ప్లాస్టరు సుద్దతో  విన్యాసం  చేశాడు. అతనిలో  ఆశక్తి  వుత్తమ రూపంతో  గర్భితమైవుంది.    
   పాశ్చాత్య విధానమూ, భారతీయ విధానమూ  ఈ  రెంటి  విషయమై నాకూ శ్రీనాథమూర్తికీ   చక్కని  వాదోపవాదాలు  జరిగాయి  అతడు పాశ్చాత్య విధానమూర్తమైన శిల్ప, చిత్రలేఖన, వాస్తు  శాస్త్రాలను గూర్చి  అఖండంగా చదువుకొన్నాడు. ఆ  చదువుకొన్న  రోజులలో  ఆ సంప్రదాయాల  సంపూర్ణ భావం  తెలియకపోయినా, ఈనాడీ కైలాసపర్వత  నిశ్చల పవిత్రజ్యోత్స్నా స్నాతుడైన అతని మనస్సు  అతినిశితమై, వెనుకటి చదువును ప్రతిభతో  స్మృతికి తెచ్చుకొని, సూక్ష్మభావాలు కూడా  సమన్వయం చేయించగలిగింది. అందుకనే  అతణ్ణి భారతీయ  విధానానికి  మార్చగలను  అనే నమ్మకం  నాకు బాగా  కలిగింది. ఒక సంప్రదాయంలో పండితుడైన  వ్యక్తి వేఱొక   సంప్రదాయం  బాగా  అర్థంచేసుకోగలడు. పాశ్చాత్య సంగీత విధానంలో  పండితుడై స్వర, శ్రుతి, తాళ, లయలను  బాగా  అర్థంచేసుకోగలడు. మొదట  పాశ్చాత్య శిల్పచిత్రకళాశయాల రహస్యం  ఏమిటో చెప్పమని శ్రీనాథమూర్తిని కోరాను.
   శ్రీనాథమూర్తి  వుపక్రమించాడు. మేమంతా సఘారామ  మధ్య  గృహంలో  చేరాము. ఆశ్రమవాసుడైన  శిల్ప  చిత్రాచార్యులు, కొదరు పండిత లామాలు చేరారు. నాకు తిబెత్తు భాష  బాగా వచ్చి వుండడం వల్ల  శ్రీనాథమూర్తి   సంభాషణ  అంతా  వారికి  ఎప్పటికప్పుడు  భాషాతరీకరణం  చేసి  చెప్పినాను.