పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వుపకరణాలు అక్కరలేదనిగాని నా ఉద్దేశంకాదు. ఏ సిద్దాంతం అర్ధం చేసుకోవాలన్నా అతినిశితమైనబుద్ది కావాలి. ఇంక పాశ్చత్యుల పరిశోధనోపకరణాలు, భౌతికమైన వస్తువులు, ప్రాచ్యుల వుపకరణాలు అధిమానసిక, ఆధ్యాత్మికములు. అవి కొద్దిమందికే లభ్యం. కొలదిజ్ఞానవంతులకు పాశ్చాత్య శాస్త్రజ్ఞానమూ, భారతీయ శాస్త్రజ్ఞానమూ రెండూ ఛాయామాత్రంగా అర్ధం అవుతాయి. నేను నా పూర్వాశ్రమంలో ఎమ్. ఏ. నే. నేను పదార్ద విజ్ఞానశాస్త్రము పుచ్చుకున్నాను. నేనూ నీకుమల్లేనె నీబోటి అనేక యువకుల మల్లేనే మన శాస్త్రాలను, మన ఆధ్యాత్మిక విచారాన్ని నిరసించినవాణ్ణే. నా గురువుగారి పరమకరుణవల్ల నిజం తెలుసుకొనడానికి అర్హత సంపాదించుకొన్నాను.

   శ్రీనాథమూర్తి మోములో  ఆశ్చర్యరేఖలు  ప్రసరించాయి. అవును; నేను  ఎమ్. ఎ. నని  తెలియడం  అతనికి  ఆశ్చర్యం కాదా?
   శ్రీనాథమూర్తి : చిత్తం.
    శాస్త్రజ్ఞానం కొంతవరకు  వచ్చింది  అంటే  ఇంతవరకు  రూఢి అయిన  శాస్త్రజ్ఞానమూ, ఇంకనూ  మిగిలిపోయినదీ రెండూ  భాగాలున్నాయి. మూడో భాగం  కొంతఅయి, కొంత  కానివిషయం. అవి అర్ధచ్ఛాయారూపాలు(పీనంబ్రా) వంటివి. ఈ  భాగంలో  మానసికశాస్త్రం, సాంఘీఖశాస్త్రం, జీవశాస్త్రం లుంటాయి. నిర్ధారణంగా వచ్చే  శాస్త్రజ్ఞానం రసాయన, పదార్ధ  విజ్ఞానశాస్త్రాలు  వుంటాయి. ఒక కుక్క  మరుసటి నిమిషంలో ఏమి చేస్తుందో  శాస్త్రదృష్ట్యా చెప్పలేము.  కాని  పడి సంవత్సరాల తర్వాత  చంద్రగ్రహణం ఎక్కడ, ఎప్పుడు, ఏ  రీతిగా  వస్తుందో  చెప్పగలం. కుక్క విషయంలో  ఆలోచనాతీతమైన  బుద్ది  అనేక శక్తి  ఒకటి  వస్తుంది.ఒకటి : శాస్త్రం  ఉన్న  సత్యాలను  వివరిస్తుంది. రెండు : శాస్త్రం  ఆ వివరణలు పూర్తిగా  అర్ధమయ్యే రూపంగా  కొద్ది  మాటలతో  వ్యంజనగా ఎక్కువ  అర్ధం యిచ్చే  పారిభాషిక పదాలు, వచనాలు, విచారణ సోపానాలు  ఇస్తుంది. మూడు : శాస్త్రం ప్రతి  పదార్ధమూ శక్తి అని  అత్యంత  సమ సూక్ష్మ  రూపాలకు పృధక్కరణం, విభజనం చేస్తుంది. అంటే ఒక పదార్ధ  స్పటికాన్ని (నత్రజని అనుకుందాము ) అణువులుగా  (మాలె క్యూల్సు) మార్చి, ఆ అణువులను  పరమాణువులుగానూ, (ఆటములు),  ఆ  పరమాణువులను శక్తి  రూపమై  విద్యుత్ కణాలైన ధనకణము (ప్రోటాను), రుణకణము (ఎలక్ట్రాను) లుగా  విభజిస్తుంది. అల్లాగే  జీవశాస్త్రంలో  రక్తం  ఎఋపు  కణాలు,  తెలుపు కణాలు, జీవకణాలు (సెల్సు)  ఆదిమ  జీవపదార్ధము (ప్రోటోప్లాజము) గా  విభజిస్తుంది శాస్త్రం.
   జమీందారు : స్వామీజీ, నా కివి  అన్నీ  తిక్కగా  ఉన్నాయి. ఓ పటాన అర్ధం కావటంలేదు. నాకు కావలసింది ఒక్కటే విషయం. పాశ్చాత్య  శాస్త్రజ్ఞానం  భగవంతుణ్ని, అంటే ఆత్మశక్తిని నిరూపిస్తుందా?
   నేను : జమీందారుగారూ ! నా వాదన ఏమిటంటే, పాశ్చాత్యశాస్త్ర  ప్రకారం  భగవద్బావం  బాగా నిరూపణ  అవుతుందనే! అందుకనే  పాశ్చత్య