పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జ్ఞానమార్గం నాశనం చేయడమే అవుతుంది. ఉత్తమ మతం ఎప్పుడూ శాస్త్రజ్ఞానాన్ని ఉపాధిగా తీసుకుంటుంది. శాస్త్రజ్ఞాన పర్యవసానంవల్ల మతంలోని ఉత్తమ భావాలకు ఎక్కువ గట్టితనం వస్తుంది.

   మా  ముగ్గురనూ  నిశ్శబ్దత  ఆవరించింది. ఇంతలో  మకాం  ప్రదేశం వచ్చింది. చీకట్లు  ఆవరిస్తున్నాయి. మేము  మా  బస  ఏర్పాటులలో మునిగిపోయాము. సర్వవిశ్వాన్ని స్పందించే భావాలు  సముద్రంలోని  అలలు ఉప్పొంగిపోతున్నవి. ఆ  తరంగాల  అంచులు  లోకాలోక  ప్రదేశాలపై విరుచుకుపడుతున్నాయి.
   
                                                                                                                8
   
   పాశ్చాత్యుల  శాస్త్రజ్ఞానాన్ని సంపుటీకరణం చేసి  శ్రీనాథమూర్తికి ఆరాత్రి  నిరూపించాను.  శాస్త్రజ్ఞానం  అంటే  ఏమిటి? ప్రకృతిని దర్శించి, ప్రకృతిశక్తి విధానాలను  పరిశోధనద్వారా  నిరూపించి, ఆ నిరూపణ  నిర్ధారణ చేసి. ఆ  నిర్ధారణ  సోపానాలతో నూతన  మార్గాలు, నూతన సత్యాల అన్వేషించడం శాస్త్రజ్ఞానం. ఇది  పాశ్చాత్య విధానం.
   శ్రీనాథమూర్తి : భారతీయుల  విధానం  ఎలాంటిదండీ?                                                                                                                           
           
               

భారతీయుల విధానం ప్రస్తుతం అలా ఉంచుదాము. భారతీయులు అతీంద్రియదృష్టిద్వారా జ్ఞానం సంపాదించారు. ఆ దృష్టీ, ఆ జ్ఞానం ఇంకో విచారణలో చెప్పుకుందాం. ప్రస్తుతము పాశ్చాత్య ఖండస్థులైన ఉత్తమశాస్త్రజ్ఞులు ఇంతవరకు నిర్దారణచేసిన శాస్త్రజ్ఞానం ఏమిటి? వారు పదార్ధాన్ని గురించి అర్ధవాదం ఎట్లాచేశారు? వారి శక్తివాదము, జీవవాదము, పరిణామము, మనశ్శాస్త్రము, ఆయిన్ స్టెయిన్ గారి పరస్పర సంభందవాదము, అన్నీ క్రోడీకరించుకొని, ప్రాచ్యసంస్కారానికి అవి సన్నిహితమూ, వ్యతిరేకమా అనేవి నిర్ధారణ చేసుకుందాము.

   శ్రీనాథమూర్తి : చిత్తం. మా  యువకులలో  సంపూర్ణ  పాశ్చాత్య జ్ఞానమూలేదు, ప్రాచ్యజ్ఞాన పరిచయం అంతకన్నా లేదు.
    పాశ్చాత్య శాస్త్రజ్ఞానం అర్ధంచేసుకోవాలంటే, శాస్త్ర  పరిభాష  పూర్తిగా  రావాలి. అ భాషవెనకాల వున్న  సంపూర్ణభావం  ద్యోతకంకావాలి. ఇప్పటికి  అనేకులు  పాశ్చాత్య శాస్త్ర  పండితులకే  ఆయిన్ స్టెయినుగారి పరస్పర  సంబంధవాదము పూర్తిగా  అర్ధంకాదట!
   శ్రీనాథమూర్తి : మా  కళాశాలలో  పాఠాలు  చెప్పే  ఎమ్. ఎస్. సి  మొదటి శ్రేణివారయిన  గురువులకే  కొన్ని  పాశ్చాత్య శాస్త్రజ్ఞాన  విషయాలు  అగోచరాలండీ.
    కాదామరి, ఇంక  ఆ  పాశ్చాత్య సిద్దాంతాల  పరిశోధన చేయగల  శక్తివుండాలి. పరిశోధనకు  తగిన  వుపకరణాలు వుండాలి. ఇవి  భౌతిక  వాదానికి  వుండాలి. అని  నేనంటే, ప్రాచ్యజ్ఞానానికి తెలివితేటలు అక్కరలేదని గాని,