పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వచ్చి, సుఖదుఃఖాలకు అతీతమైన ఆ స్థితిని చేరడానికి ప్రయత్నించడం ఒక రకమైన ఆరాధన. దీన్నే జ్ఞానమార్గం అంటారు.

   జమీందారుడు : నాకు  కష్టాలు కలిగించవద్దని మొక్కుకుంటే  ఆ  కష్టాలు రాకపోవడం  జరుగుతూ  ఉంటుంది కదాండీ స్వామీ? 
   నేను : అవునండీ, దాన్ని గురించి చెప్తాను. రెండవది, నువ్వు  ప్రకృతి శక్తులను గమనిస్తావు. దాని  అపారాద్భుతత్వము  నీలోని మానసిక  శక్తులను  స్పందించి నీకు ఆనందం  కలుగజేస్తుంది. ఆ  ఆనందంలో  నువ్వు  ఆ అద్భుతాన్ని ఆనందంగా  వర్ణిస్తావు. అది మామూలుగా చెప్పితే  నీకు మొదట  కలిగిన  ఆనందం  కలుగదు. అందుకని నీలోని  ఆనందాన్ని  వ్యక్తీకరించగల  విధానం, విపరీత  రచనా  విధానమే. అదే సంగీతం, అదే కవిత్వం, అదే చిత్రలేఖనం, నాట్యం, శిల్పమున్నూ.
   శ్రీనాథ : స్వామీ! ఈ  కళలలో  భగవంతుడు, మనుష్యుడూ, ఎక్కువగా  వస్తారేమండీ?
   నేను : వస్తున్నా! మూడవ మోస్తరు  ఇలా వచ్చింది. మనుష్యుడు  ప్రకృతి  శక్తులను  చూచాడు. ఆ శక్తులను  ఆరాధిస్తే తనకు మేలు  వస్తుంది అనుకున్నాడు. లేకపోతే  ఆ శక్తులీతన్ని నాశనం  చేస్తాయి. అనుకున్నాడు. వరుణ, ఇంద్ర, అగ్ని మొదలైన  శక్తులను పూజించాడు.  యాగాలు చేశాడు. ఇది  భయజనితారాధన.  ఈ  ఆరాధన  హీనస్థితిలో  ఉన్న మనుషులలో  ఎక్కవ.
   శ్రీనాథ : తిరుపతి వేంకటేశ్వరుని మొక్కు, మంత్రాల  పునశ్చరణ ఏమిటండీ?
   నేను : విను, అదే  చెప్పబోతున్నది.  ఈ  మూడు  మోస్తర్లు, ఒక దానితో ఒకటి  సమంగాగాని, ఒకటి  ఎక్కువగాగాని సంగమం అవుతాయి. జ్ఞానమార్గం, సౌందర్యమార్గం లేక  ప్రపత్తి  మార్గం  లేక ప్రపత్తి మార్గం సమంగా  కలిసి  విసిష్టాద్వైతం, ముస్లింమతం, ఆదిశైవము మొదలైనవి వచ్చినవి. సౌందర్య మార్గం ఎక్కువై వామాచార శాక్తేయం, గౌరాంగమతం, సూఫీమతం వచ్చాయి.పూర్తిజ్ఞానమార్గం, హీనయాన  భౌద్దం, చార్వాకం, వైశేషికం, కాపిలమున్నూ,జ్ఞానం  ఎక్కువై  అద్వైతం వచ్చింది. 
   జమీం : భయాదారంవల్ల, అమ్మవారి జాతర్లు, మొక్కుబడులు వచ్చాయి అంటారు.
   నేను : జ్ఞానమార్గం, భయమార్గం, భక్తిమార్గం అన్నీ  కలసి  వేలకు వేలు  విధానాలు ఉద్భవించాయి.
   శ్రీనాథ : ఇప్పుడు  శాస్త్రజ్ఞానం వృద్ది  అయినందువలన, మతం యొక్క  భవిష్యత్తు పరిణామం ఏమవుతుంది స్వామీజీ?
   నేను : శాస్త్రజ్ఞానం ఎక్కువౌతున్నది నిజమే. మూఢత్వం  చొరనీయని  విజ్ఞాన మతాన్ని  ఇంకా  బాగా  అర్ధం చేసుకుంటాడు. మతం అనేది  శాస్త్రజ్ఞానంలోని లోట్లు  వెదికికాబట్టి  దేవుడున్నాడు అనదు. అలా వాదించడం