పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నేను : ఎందుచేత స్త్రీలో ఎక్కువ మనుష్య సౌందర్యం వుందంటావు? జంతువులలో, పక్షులలో మగవే ఎక్కువ సుందరంగా ఉంటాయి. కదా! కోడిపుంజు, నేమలిపుంజు, మగపులి, మగసింహము, ఆంబోతు ఎంత అందంగా ఉంటాయి?

   శ్రీనాథ : చిత్తం. జంతు స్థితినిదాటి  మనుష్యుడు  పైకి  వచ్చాడు. జంతు, పక్షి కుటుంబాలలో  పనిబాధ్యత ఆడదానిది. మగది ఆడదాని  సంతోషం కోసం  మాత్రం. అందుకని  అందమూ, పాటా  మగదానికే  వుండాలికదా! ఇక  మనుష్యులలో  పురుషుడు పని  నిర్వహించేవాడు, స్త్రీ  పురుష ప్రీతికోసం. అందుకని  స్త్రీలోనే  అందం అంతా  చేరింది.
   నేను : పురుషులకూ, స్త్రీలకూ  సమానహక్కులు, సమాన బాధ్యతలు వచ్చిన్సప్పుడు పురుషుని కోసం  స్త్రీ  అంటావేమిటయ్యా!
   శ్రీనాథ : స్త్రీ  పురుషులు  సమాన  కర్మపరంతంతులైన వెనుక  నెమ్మదిగా  సౌందర్యం  ఇద్దరికీ  సమమౌతుందేమోనండీ!                                                                                                                           
           
               

జమీం : అది ఎల్లాగయ్యా! పనివల్ల సౌందర్యం తక్కువ, పని లేని వారికి సౌందర్యం ఎక్కువా అన్నావుకదా! స్త్రీ పురుషు లిద్దరూ సమానంగా పనిచేసేటట్టయితే ఇద్దరిలోంచి అందం నశించిపోతుందేమో! అంటే మానవ జాతిలోంచే అందం పోతుందేమో?

                                                                                                                   7
   
   మా నడకా, మా  సంభాషణా  రెండూ  సాగుతూనే  వున్నాయి. మాదారి  మానససరోవరతీరం ప్రక్కనే, పర్వత సానువులమీద  ఎగుడు దిగుడు రాళ్ళ ప్రక్కగా, గుట్టలమీదుగా ఉన్నది. కొన్ని చోట్ల మంచుకరిగి  నీరుగా  ప్రవహించి  చిన్న, పెద్ద  పతనాలుగా  మానససరోవరం చేరుతున్నాయి. చిన్న చిన్న వాగులు, ఆ  వాగులు  దాటుతూ  మనుష్యుడు  మాత్రం  నడవగలిగిన  ఆ దారిలో  పూవులు  పూచే  చిన్న  గుబురులమధ్య  ప్రయాణం  చేస్తున్నాము. సరోవరానికి  ఉత్తరంగా  కైలాసశిఖరం బంగారు రంగులతో  ప్రజ్వరిల్లుతూ  బంగారు కమలంలో  పరమశివుడు పద్మాసనస్థుడై  యోగసమాధిలో  ఉన్నట్లు  దర్శనమిస్తున్నది.
   నేనాపవిత్ర  సందర్శనానందంలో పులకరించిపోయి చూడు మూర్తీ! ఆ  సౌందర్యం, ఆ  కైలాసశిఖరం, కనకాంభోజగతం, నవేందుమకుటం, కైలాస ప్రభుం! అన్నట్లుగా  ఉన్నది. ఆ సౌందర్యాన్ని  వర్ణించగలమా?  అన్నాను.
   శ్రీనాథమూర్తి : ఆ  దృశ్యం  అద్భుతంగానే  ఉన్నదండీ, పదినిమిషాలలో  ఒక చిన్న బొమ్మ  వేసుకొని  మిమ్ము  కలుసుకొంటాను.
   నేను : అల్లాగే  మూర్తీ, మేమంతా ముందుకు సాగం. అదిగో అక్కడ కూర్చుంటాము. మన మకాం  ఒక  అరమైలు  మాత్రం ఉంది.
   శ్రీనాథమూర్తి  పదినిమిషాలలో  బొమ్మ  పూర్తిచేసి, ఆ ప్రకృతి సౌందర్యం, ఉప్పొంగిపోతూ వీక్షిస్తున్న  మమ్మల్ని కలుసుకొన్నాడు.
   నేను : మూర్తీ! మనుష్యుని ఆరాధన  మూడు  మోస్తర్లు. ప్రకృతిలో  శక్తులను గమనించి, ఆ  శక్తులకు అతీతమైన  ఒక ఆధారం  ఉందని  సిద్దాంతానికి