పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అది న్యాయం కాబట్టి!

    న్యాయం అన్నదానికి అర్ధం ఏమిటి?  మనుష్యులకు  మంచిది  కాబట్టి  న్యాయం. మనుష్యులకు  ఇది  మంచిది  అని  నిర్ణయించేవారు  ఒక మనుష్యుడో  మార్క్సువంటివాడు లేక  చాలామందో__ ఇంటర్  నేషనల్__దీనికి  వ్యతిరేకంగా  హిట్లరో__ఒక మనుష్యుడు  లేక  నాజీపార్టో__వ్యతిరేకంగా నిర్ణయించవచ్చు! ఆ  మంచిదన్న  న్యాయంకోసం  నువ్వూ, నేనూ  ఎందుకు బాధపడాలి? 
                                                                                                                           
           
               

మనం అన్నదాంటో నేనూ ఉన్నాను కదాండీ. కుటుంబం బాగు అన్నదాంట్లో కుటుంబంలోని ప్రతిమనుష్యుడూ ఉన్నాడు. లోకకుటుంబంలో కూడా ఉంటాడు కదాండీ.

    ఇప్పుడు  రెండు  కుటుంబాలయ్యాయి కదా? ఈ  రెంటిలో ఏది సరియైన  న్యాయం?
    అందరికీ లాభించేది. 
    ఆ  విషయం నిర్ణయించే దెవరు? 
    అందరూ! 
    నాజీలూ, ఫాసిస్టులూ  యింకా  చాలామంది  అందులో  చేరారు కదా? 
    ఎక్కువమంది. ఒక్కడు  చెప్పినా   ఎక్కువమందికి నచ్చవచ్చును. 
    అంతేకాని, సర్వవిశ్వాన్ని  మధించి  తెచ్చిన  సత్యాలు  కావన్న  మాటేనా  ఇవి? 
    నేను  ఆలోచించుకొని రేపు  చెప్తానండీ. 
       
                                                                                                                   6
   
   శ్రీనాథమూర్తి  తిన్నగా డేరావదలి  మానససరోవర తీరానికిపోయి, అక్కడ మంచులేని  ఒక  రాతిబండమీద  కూర్చుని  ఉన్నాడు. శ్రీనాథమూర్తిలో  బాహ్యసౌందర్య పూజా  వాసనలు నిండి  ఉన్నాయి. ఆ  బాహ్య  సౌందర్యం  వెనకాల  మనస్సౌందర్యము, ఆత్మసౌందర్యము కూడా  ఉండాలి. ఈమూడు  సౌందర్యాలూ  మహోత్తమ  స్థితిలో  సంగమించడమే సంపూర్ణావతార భావము. ఆత్మసౌంధర్యంలేని  తక్కిన రెండు  సౌందర్యాలూ, మనుష్యుని  రాక్షసునిచేస్తవి. ఫ్రాంక్ ఐన్ స్టెయిన్ చే  సృష్టింపబడిన  రాక్షసుని  వంటివాడవుతాడు. ఒక  బాహ్యసౌందర్యం  ఉన్న  మనుష్యుడు జంతుసమానుడు. జంతువులో విలసించేది భగవంతుని  ప్రసాదమగు  ప్రకృతి  సిద్దగుణం (ఇన్  స్టింక్ట్) వల్ల వచ్చే మంచి చెడ్డలు  మాత్రం. ఆ జాతి  స్త్రీ  పురుషులలో  అది ఎక్కువగా  ఉండి మానవత్వ  సహజమైన  మనస్సు  తక్కువగా  ఉంటుంది. అలాంటివారిలో  ఆలోచన తక్కువ  ఉంటుంది.    
   ఆ  మధ్యాహ్నం  మేము  ప్రయాణం చేస్తున్నప్పుడు  జమీందారుడు  కూడా మాతో కలిసి  నడుస్తున్నాడు. ప్రొద్దుటి  ఆలోచనలు  నన్నింకా  వీడలేదు. నేను  శ్రీనాథమూర్తిని చూచి శ్రీనాథమూర్తీ! నీ  హృదయంలో  మానవ