పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వెనక్కులాగే శక్తులు. ఆర్ధిక సమత్వం, తర్వాత రాజకీయ సమత్వం ప్రపంచాని కంతకూ సరియైన ధర్మం. జాతులు అనవసరపు అడ్డుగోడలు. దేశాలు భూగోళ భాగాలు మాత్రం. ఇవన్నీ మాబోటిగాళ్ళ వాదనలు. మీ అభిప్రాయం సెలవియ్యాలి.


మానస సరోవరతీరంలో నుంచుని దూరంగా ప్రత్యక్షమయ్యే కైలాస పర్వతాన్ని, మానస నిర్మల హృదయంతో ప్రత్యక్షం అయ్యే ఆ దివ్యపర్వత చ్ఛాయను చూస్తూ సర్వప్రపంచమూ మరచిపోవచ్చును. మానవ సరోవరానికీ, కైలాసానికీ ఉన్న శ్రుతి. పద్మానికీ సూర్యోదయానికీ వుండునా? సుందర శ్రీవిలసిత వనితా వక్షోజాలకూ, ముత్యాలహారానికీ వుండునా? విశాలదీర్ఘీ వినీల పక్ష్మాంకిత లోచనలకూ వాలుచూపులకూ వుండునా? సౌందర్యానికీ, ఆనందానికీ, పారిజాతానికీ, పరిమళానికీ వుండునా?

   ప్రభూ! కైలాసమూర్తీ! నీవే  ఈ పర్వత  ప్రభువువు. నీవే సర్వ లోకాశ్రయ పాదుడవు. నీవే  పరమ  సృష్టి  స్వరూప  నృత్య  వినోదివి. నీ బంగారు జంటలు  సర్వ  విశ్వ  ప్రసరిత ప్రాణకాంతులు. నీ  హస్తాలు  సర్వ  సృష్య్టాధార  చైతన్యాలు.  నీ త్రినేత్రాలు  సర్వశక్ట్యాత్మికవస్తు,  వస్తుసౌందర్యం, సౌందర్యానందాలు! ఓ  పరమేశ్వరా!  నీవు  యోగివి. యోగస్వరూపుడవు, యోగాతీతుడవు. నీవు మాతవు. మానమవు, మేయమవు. నీవు జ్ఞాతవు,  జ్ఞానమవు, జ్ఞేయమవు. ఓ  స్వయంభూ, నీకు  ఉనికి లేదు. నీకు  చేతనము  లేదు, నీవు మాత్ర మున్నావు. ఓ  సదాశివా!  నీవు కర్తవు, కర్మవు, క్రియవు. నీవు మహాకావ్యానివి . నీవు రసమవు, స్థాయీ సంచారీ, విభావానుభావ స్వాతిక  భావాలు నీవే. నువ్వు  చిత్రకారుడవు, కుంచెవు, వర్ణాలు, ఫలకానివి, చిత్రమవు నువ్వు వచనమవు. అన్వయానివి. నీవే  వ్యాకరణమవు. ఓ గుణాతీతా! నువ్వు  విరోధివి, స్నేహితుడవు, తండ్రివి, కుమారుడవు. నువ్వు దారివి, దారిన నడిచేవాడివి, గమ్యస్థానానివి. నిన్ను సందర్శించిన  పరమాద్భుతానందంలో, ఆటలలో  చిన్న బిడ్డల  ఆనందం, యువతీ యువకుల  ప్రేమానందము, కుటుంబికి సంవత్సము, పార్జనానందము, జ్ఞానికి విభూత్యానందము అణువులు మాత్రము. 
    కైలాసేశ్వరుని సందర్శిస్తున్న  శ్రీనాథమూర్తి  మన లోకంలో  లేడు. కొద్దిమంది  మాత్రమే  సందర్శించిన మహాదృశ్య  మాటాడు సందర్శించాడు. ప్రకృతిలోని  ఒక సౌందర్య ఖనిని  సందర్శించాడు. అతనిలోని అహంభావము,  గర్వం రేకెత్తాయి. అతనిలో కళాత్రుష్ణ గట్లుతెగి పరవళ్ళెత్తుతున్నది. అతనిలో ఎక్కడో దాగివున్న   నిశ్చలభక్తిలో  స్పందనం కలిగింది. ఈ  త్రివేణి  సంగమజ మహానదికి అతడు  నిజమైన  భగీరథుడు కావాలి!
   భోజనాలై   విశ్రమిస్తున్నప్పుడు, నా  దగ్గరకు వచ్చి  కూర్చున్న  శ్రీనాథమూర్తి వైపు తిరిగి,  బాబూ, నువ్వు నిన్న  అడిగిన  ప్రశ్నలకు  నాకు తోచిన  సమా