పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రాన ఆకాశంలో దివ్యదర్శనం ఇచ్చే కైలసేశ్వర శిఖరానికి అభిముఖుడై, పద్మాసనాసీనుడై, కన్నులు మూసికొని ధ్యానంలో మునిగిపొయినాడు.

   నేననుకొన్న  ముహూర్తం  వస్తూవుంది.  ఆ తర్వాత  అతని  అదృష్టం. ఆ  ముహూర్తానికి అతన్ని సిద్దం  చేయాలి. అతనితో  వాదించాలి.  అతడు తనలో  తాను  చర్చించుకునే  విధానమే మార్చాలి.  ఇవి  నా కర్తవ్యాలు.  అలా ఏదో  ఒక  విచిత్రమైన యోగంలో  నిశ్చలుడైనాడు శ్రీనాథమూర్తి. ఆ  విచిత్ర  యోగంలో  ఇరవై నిమిషాలుండి, లేచి తిన్నగా  నా దగ్గరకు  వచ్చినాడు.  స్వామీ, ఈ  శుభ ముహూర్తంలో  నాకేదైనా  చిన్న  మంత్రం  ఉపదేశించండి.  నా జీవితంలోని  కల్మషం  కడిగి  నన్ను  పరమ జ్ఞానోన్ముఖునిగా చేయగలిగిన  మంత్రం  దయచేయండి! అని ప్రార్ధించాడు. వచ్చిందా పుణ్యముహూర్తం!  
    సరేనయ్యా, నీకు  దక్షిణమూర్తి  మంత్రం ఉపదేశిస్తాను. అది  ఒక లక్ష  నెమ్మదిగా  పునశ్చరణ చేసుకో. తర్వాత  ఓపిక  వుంటే  మంత్రం బీజాక్షర  లక్షలు  పునశ్చరణం  చేసి  శాంతిహోమమూ,  సంతర్పణా చేయిఅన్నాను. అతని  కా మంత్రం  ఉపదేశించాను.  ఆ సమయంలోనే  నూట ఎనిమిదిసారులా మంత్రాన్ని  నేను  చెబుతూ  అతని  చేత  పునశ్చరణ  చేయించాను.  మధ్యాహ్నం  పన్నెండింటికి భోజనాలయ్యాయి. 
   శ్రీనాథమూర్తి  దూరంగా  గోచరమయ్యే  కైలాస  పర్వతాన్ని, మానస  సరోవరాన్ని  చిత్రం వేసుకుంటూ  సాయంకాలం  నాలుగింటివరకు గడిపాడు.  ఈలోగా  సేవకులు  మా  గుడారాలు  చుట్టివేసి  గుర్రాలమీద ఎక్కించారు. మేము నాలుగున్నరకు  బయలుదేరి   రెండుమైళ్ళు  నడచి, ఆ సాయంకాలము  మానస  సరోవరానికి  వామతీరాన  వున్న  కొద్దిమంది  టిబెట్టు  లామాలున్న  ఒక  చిన్న  బౌద్ద  సంఘారమంలో  మకాం చేశాము.
   ఆ  రాత్రి  శ్రీనాథమూర్తి  జపం ముగించి  నా  దగ్గరకు  వచ్చి,  స్వామీ! ఈరోజుల్లో  మా లోకం  అంతా  అనేక  అనుమానాలతో  నిండివుంది. నిశ్చయాలు  ఒకరికీ  లేవు. ఒకవేళ  ఏదైనా  నిశ్చయం  వుంటే  అది పక్వంగాకుండా ఊదరకొట్టి పండించిన  అరటిపండులాంటి నిశ్చయమేఅన్నాడు.
    ఏమిటవి బాబూ! నాకు శక్తి  వున్నమటుకు  నీ అనుమానాలు  పోగొట్ట  ప్రయత్నం  చేస్తాను అని  జవాబిచ్చాను.
    మా  యువలోకంలో  ప్రపంచానికి  సరియైన  స్థితి  కమ్యూనిజం అనీ, అందుకు దారి  ప్రజావిప్లవం  వల్లనే  అనీ,  ఆ   దారిలో భగవంతుడు  లేడు. ఆ దారిలో  మతాలు లేవు. ఆత్మ వుందని  నమ్మం. మతగ్రంథాలు  మానసిక  వైపరీత్యాలు, వీటి  అన్నిటిపైనా ఆధారపడిన   కళ హీనము.  కళకోసం కళ  అనటం  క్షమింపరాని  ద్రోహం. ప్రజాభ్యుదయ  స్వరూపం  కాని కళ, నీరసుని  కూనిరాగాల వంటివి.
    ఆహింసలో  మగతనం  లేదు.  అది   మానవలోకాన్ని నాశనం  చేస్తుంది. సద్గుణాలు  సమయానుకూల  నటనలు మాత్రం.  పుణ్య  దయాధర్మ సత్యశౌచాలు