పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వాలుతున్నవి. మత్తెక్కి వెళ్ళిపోతున్నవి. ఆ పుష్పపు సువాసన ఇతర పరిమళాలను చిన్నబుచ్చుతుంది. అదే పారిజాత కుసుమము అనుకున్నాను. పుష్పస్వరూపము ఒక మహోత్తమ నక్షత్రస్వరూపమై వెలుగుతున్నది. ఆ పువ్వును నేను సంపాదించగలిగిననాడు, అని నా హృదయంలో ఒక మెరుపు ప్రసరించింది.


                                                                                                                    40
   
   అలకాపుర  బాహ్యసౌందర్య చిహ్నం  సత్పథసరోవరం. ఆ  సరోవరం  మైలున్నర విశాలం. అత్యంత  శుభ్రనీలజలపూర్ణము. అలకాపురంలో మధ్యనుండేది  చంద్రకుండము. దానికావల మైలుదూరమున సూర్యకుండము. అంత ఎత్తున  సత్పాథాది  సరోవర  కుండాలలో, వేడినీటి ఊటలు  గర్భమందుండుట  చేతనే, నీరు ఆ  అతిశీతలంలో కూడా  పెరుకోకుండా ఉన్నాయి. అలకాపురీ ద్వారమైన  ఆ  హిమసమతల ప్రదేశాన్ని చక్రతీర్థమంటారు. ఆ  చక్రతీర్థంలో మానవవాసన  పూర్తిగా కరిగిపోతుంది. ఏదో  అననుభూతశాంతి హృదయాల నావరిస్తుంది. నాకా  చక్రతీర్థ నిత్యవాసత్వం  ఏల  లభించకూడదన్న గాఢవాంఛ జన్మించింది! సత్పథ  సరోవరతీరాన  నిలుచుండి, ఆ  మధ్యాహ్నాన  ఎదుట  హిమాలయాలను  దర్శిస్తే  అవన్నీ  ఎక్కడికో, ఏ  పధాలకో  తీసుకొని పోయే  స్పటిక  సోపానపంక్తిలా  కనపడ్డాయి.  ఈ  దృశ్యానికే  స్వర్గారోహణ  దృశ్యమని  పేరు.
   సూర్యకాంతిలో  ఆ  పర్వతాగ్ర  ప్రదేశాలు వెండి, రత్నసోపానాలులా కనిపించాయి.  ఇక్కడనుండే  పాండవులు  స్వర్గారోహణము కావించారట. ఆ  సోపానాల  నెక్కుచు  అనంత  పథాలకు  వెళ్ళిపోగలనా?  మానవాతీత   పథసందర్శనం మానవులలో   ఉన్న  మానవత్వాన్ని  నాశనంచేసి, వారికి  మానవా తీతసత్వాన్ని  అర్పిస్తుంది?  ఆ  మానవాతీతత్వం  అనుభవించగలం. వర్ణించలేము. ఆ  ఆనందానుభవమే  అమరత్వమేమో!
   తోడు  దారెరిగిన మనుష్యుడు  లేక  ఎవ్వరూ  ప్రయాణం  చేయలేరట. అయినా  అంతకుముందే  ఒక  సన్యాసులజట్టు  ఒకటి  ఆదారిని ప్రయాణంచేసి  ఉండడంచేత  వారి ప్రయాణం  జాడలు  స్పష్టంగా  కనబడినవి. అదీగాక  ఆ సన్యాసులను, ఆ  దారినిగురించీ  ఆ  దృశ్యాలను గూర్చీ  పూర్తిగా  తెలుసుకున్నాను.  అందుకనే  నాకా  దారి సుగమమైంది.  తిరిగి చక్రతీర్ధము  వచ్చి, ఇంకను దిగి  శతధారల  సందర్శించునప్పటికి  నాలుగైనది. వడగళ్ళు కురియుట  కారంభించినవి. అత్యంత  శీతలవాయువు  వీవదొడగని. నా  కాఫీ అంతా  అయిపోయినది. బిస్కట్లు అయిపోయినవి. ఒక బండరాతి  క్రింద  దూరి, చమరీమృగంలా నేను  మోసే  సామానులు దింపి, గాలిరాకుండా  ఒక గొంగళీ అడ్డుపెట్టి, నా  స్టవ్ వెలిగించి, వెలగకాయంత ఉన్న