పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వించిందట. ఆమె పరమాద్భుత దివ్య సౌందర్యాన్ని చూచి రంబాదులు పారిపోయారట. ఇంద్రు డామెకు దాసుడయ్యాడట.

                                                                                                                    35
   
   ఆ  బాలిక  నాట్యం  మనోహరంగా  ఉంది. మమ్మల్ని మెప్పించాలని  మరీ  చక్కగా  పాడుతూ, చేతులూ  కళ్ళూ  తిప్పుతూ  నాట్యం చేసింది. ఆమె   అలా నాట్యం  చేస్తూ, చేస్తూ  నాదేవి  శకుంతలగా మారిపోయింది.  ఎప్పుడు  నేర్చుకుంది   నా  శకుంతల  నాట్యం?  నా   శకుంతల   ఊర్వశి కాదు  గదా? ఏదైనా  శాపం పొందివచ్చి, శాపం తీరగానే  వెళ్ళిపోయిందేమో? పురూరవుణ్ణి, అర్జునుణ్ణి  ఆమె   ప్రేమించింది.  పురూరవుడు  ఆమెను  ప్రేమించాడు. అర్జునుడు ప్రేమించలేదు.  మా  తెలుగు  కవులలో  ఉత్తముడైన  దేవులపల్లి  ఊర్వశీభావాన్ని అత్యంతము  ప్రేమించి, సర్వకాలం  విరహవేదనపడుతూ ఉంటాడు.
   అప్సరోభావం  అద్భుతమనినా  ఉద్దేశం హేమా!  అప్సరసలు  అమృతంతో, లక్ష్మితో  ఉద్భవించినవాళ్ళు, పాలసముద్రం  అంటే  విశ్వ సౌందర్యం. ఆ  సౌందర్యాన్ని  మధిస్తే  సౌందర్యమూర్తములైన   వస్తువులు  ధవళమై, వెలుగుతూ  ఉద్భవించాయి. శక్తి  సౌందర్యం  కౌమోదికి, నాద సౌందర్యం  పాంచజన్యం, కాంతి సౌందర్యం కౌస్తుభం, మహాపథ  దిక్సౌందర్యం  ఐరావతం, జీవితాభీష్ట  సౌందర్యం  చింతామణి, వేగ సౌందర్యం  ఉచ్చైశ్రవము, వితరణ  సౌందర్యం  కల్పవృక్షము, నృత్యకళా సౌందర్యమూ, కామ  సౌందర్యమూ అప్సరసలు,  పరమేశ్వర రూపసౌందర్యం లక్ష్మి, కాలాతీతత్వ   సౌందర్యం అమృతం. ఈ  భావాలు  నాకు తర్వాత  తర్వాత  కలిగాయి.  పరమ కామము, పరమ నృత్యమూ  ఊర్వశిలో  సౌందర్యోజ్వల  రూపాయలయ్యాయి. 
   నాట్యం  కాగానే  ఆ  అమ్మాయి  నా  దగ్గిరకు  వచ్చి పైస యాచించింది.
   ఆ అమ్మాయిలోని బిగువులు  చూచి  నే నామెను  నా  మనస్సులో  విగతవస్త్రతను చేసి  ఆ  అందాలు  చూశాను.  నా  కళ్ళలో,  ఆమె   దిగంబరత్వాన్ని  చూచింది కాబోలు  ఆ  అడవిపిల్ల  సిగ్గుపడుతూ,  చిరునవ్వు  నవ్వుతూ వాళ్ళ  జట్టుకడకు  పరుగెత్తింది.  తక్కిన  అమ్మాయిలు ఫక్కున  నవ్వుతూ ఆ  బాబుని  చూచి  కన్నేసినావా?  యని  వేళాకోళం   చేశారు.
   నాకా  భాష  తెలియనట్లు  నటిస్తూ  కొన్ని  నగలు, ఇన్ని  సూదులు, దారం కట్టలు   ఆ  అమ్మాయికి  బహుమతి ఇచ్చాను.  తక్కినవారికెవ్వరికీ కోపం రాకుండా సూదులు, దారపు  ఉండలు  పంచి  ఇచ్చాను. హిమాలయ   పర్వతవాసినులకు సూదులు, దారపు  ఉండలూ  అంటే  మహా  ఆనందం. రోట్టయినా మానుతారుగాని  సూదులు, దారాలూ వదలరు.
   ఎవడో  మహాదాత  బయలుదేరాడన్న వార్త  ఆ  పర్వత ప్రదేశాలలో  మారుమ్రోగింది కాబోలు, ప్రయాణం  పొడుగునా  భూటియాలు, లేప్చాలు మొదలైన  పర్వతవాసుల  స్త్రీలు,  బాలబాలికలు పైసా, నగలియ్యి, సూదియ్యి, దారమియ్యి