పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గంగోత్రి పోదలుచుకున్నవారు దేవప్రయోగ దగ్గరనుండి భాగీరధి నది ఒడ్డునే ప్రయాణం చేసుకుంటూ పోవలసి ఉన్నది. యమునోత్రి పోదల్చుకున్నవారు గంగోత్రి దారిలో విడిపోవాలి.


రుద్రప్రయాగనుంచి మందాకిని ఒడ్డునే కేదారనాథ్ కు యాత్ర చేస్తారు. అలకనందా తీరాన్నే రుద్రప్రయాగనుంచి ఆ సాయంకాలమే ప్రయాణం సాగించి, శివానంద వెళ్ళేసరికి నాకు గాడ్పు కొట్టినంత పనైంది. కాఫీ మధ్య మధ్య నాలుగు సారులు తాగాను. ఆ రాత్రి శివానందిలో మకాం వేశాం. తెల్లవారగట్లనే బయలుదేరి హరి ఆశ్రమం. ఖమెరాలలో ఆగకుండా గౌచాల్ చేరాము. ఇక్కడవరకు విమానాలు తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ సాయంకాలం బయలుదేరి, పిండారిగంగ అలకనందలో సంగమించే కర్ణప్రయాగ చేరాము.

   నందప్రయాగ  వచ్చేదారిలో  హిమాలయవాసులైన  లేప్చాల జట్టు  ఒకటి  మా  కెదురైంది. వాళ్ళు  రోడ్డు ప్రక్కనే చల్లటి మామిడిచెట్ల  నీడలో మద్దళం వాయిస్తూ పాడుతూ  నాట్యం చేస్తున్నారు.  అందులో  ఒక  అమ్మాయి  అచ్చంగా  గంధర్వ బాలికలా  ఉంది. బంగారు చాయ, గుండ్రటి మోము, స్పుటరేఖా  సమన్వితమైన  దేహమూ  నన్ను  పరవశుణ్ణి  చేశాయి. వరూధిని కూడా  ఈలాంటి  బాలికే  అయి ఉండాలనుకున్నాను. ఆమె బట్టలు  రంగు రంగులతో  ఒక  చిత్రవిధానంలో వున్నాయి, తడుపుట, ఆరవేయుట ఎగరనే ఎగరవు.  నగలూ లేవు. ఏమి అందము!  నేనా  నాట్యం  చూస్తూ  ఆ చెట్లనీడనే  కూర్చున్నాను. నాతో  రాజపుత్ర  జమీందారుడును  కూర్చున్నాడు. ఆ  రాజపుత్ర  జమీందారుని  పేరు  రాజగోవిందసింహకపూర్   బహదూర్,  ఈయనకు  నలభై  అయిదేళ్ళుంటాయి.  పొడుగాటి  మనుష్యుడు. బంగారానికి  వన్నెదిద్దే చాయ.  గరుడనాసిక, కోలమోము, బవిరి  గడ్డంతో  ఏ  ధర్మరాజునో, అర్జునుణ్ణో తలపించే  అందం  కలవాడు. మా  ఇద్దరి  సంభాషణ హిందూస్థాన్  భాషలో  జరిగింది.
   బాబూజీ! ఆ  అమ్మాయి  ఎంత చక్కగా  పాడుతోంది. కోయిల  కంఠం కాదా?
   అవును  రాజబహదూర్! ఆ   నాట్యం   చూస్తోంటే  ఊర్వశి  నృత్యం  ఈలాగే  వుండేదేమోనని  అనిపిస్తోంది.
   ఊర్వశి  నృత్యం  ఎందుకు  జ్ఞాపకం  వచ్చింది మీకు? 
   మనం  ఊర్వశి పుట్టిన  స్థలం  చూడబోతున్నాం గాదా  అండి? 
   అదేక్కడండోయ్?!
   నరనారాయణాశ్రమమైన  బదరికా క్షేత్రమే  కదాండి. నరనారాయణులు  తపస్సు చేసుకొంటుంటే, ఆ  తపస్సు  చెడగొట్టడానికి ఇంద్రుడు  రంబాదులను పంపిస్తే  చిరునవ్వతో  నారాయణుడు  తొడ చరవగానే,  ఊర్వశి  ఉద్భ