పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కాబోలు, మా స్వామీజీ బిల్వకేదారం దగ్గర వారిని చూచి ఈ అబ్బాయిని ఆరోగ్యంకోసం నాతో తీసుకొని వెడుతున్నానుఅన్నారు.

   జమీం : గంగాస్నానంకంటె   వేరే  ఆరోగ్యకరమైన   విషయం  ఉందాండి?
   స్వామి : ఆరోగ్యం  కుదిరినకొలదీ  గంగాస్నానం   ప్రారంభిస్తాడీ బాలుడు.
   జమీం  : చాలా  ఆరోగ్యంగా  కనబడుతాడు.
   స్వామి  : దేహారోగ్యం    రెండుమూడుసారులు    చెడిపోయింది. ఇప్పుడాతనికి నరాల జబ్బు.
   జమీందారుడు, కారణంలేక  స్వామీజీ   నా  తరపున  వాదించరని  ఎంచి  కాబోలు  అంతటితో  ప్రశ్నలు మానేశాడు. అవసరం  అవుతుందని  నేను కొన్న పన్నెండు  కప్పుల  ధర్మాస్ ప్లాస్క్ లో ప్రతి   ఉదయ  మకాములోనూ   టీ   చేయించి  పోసి   ఉంచేవాడిని. నాలుగు కప్పుల  ప్లాస్క్ లో,  నా  కోసం  కాఫీ స్వయంగా  తయారుచేసుకొని  పోసి  ఉంచేవాడిని.
   కైలాసానంద  స్వామీజీ  ఆ   దారిలో  అందరికి  పరిచయయే  అందరు  ఆయన్ను  గౌరవించేవారు. మా  నడకలో  ఎన్ని  మకాములవరకో  స్వామీజీ  ఇంకా కొందరు  సన్యాసులూ,  జమీందారుగారి జట్టులో కొందరూ  ముందుపోతూ  ఉండేవారు.  నేను  నెమ్మదిగా  నా  ఆలోచన  లేమిటో  ఇప్పటికీ  నాకు  జ్ఞాపకం  లేవు.
   మలాస్ చట్టీ, రాణీబాగ్, కొల్టా, రామాపురం,  బిల్వకేదార్ మకాములు గడిచి శ్రీనగరం  చేరుకున్నాము.  శ్రీనగరంలో  కాలాకంబళీ  వాలా  సత్రంలో  మకాము చేశాము. కలాకంబళీవాలా   ఒక  సన్యాసి.  ఈయన  హిమాలయ  యాత్రలు  చేసేటప్పుడు  పడేభాదల్ని గమనించి, అక్కడినుంచి  దేశమంతా తిరిగి  చందాలు  వసూలుచేసి, హరిద్వారంలో, హృషీకేశంలో,  దేవప్రయాగలో, శ్రీనగరంలో, ఇతర  మకాములలో  ధర్మశాల లేర్పాటు చేశాడు. ఈయన పెట్టించిన  సత్రాలలో  బీదలకు, సన్యాసులకు  సదావర్తులిస్తారు. వైద్యానికీ  ఏర్పాటులు  చేయబడినాయి.   నల్లటి  కంబళీ  కప్పుకుని  ఉండేవాడు  గనుక  ఈ  సన్యాసికి  కాలాకంబళీవాలా అని పేరు వచ్చింది. ఈయన  బ్రహ్మసాయుజ్యం  పొందిన  తరువాత, ఈ  మహామహుని  ఉత్తమకార్యం కొందరు  పుణ్యవంతులగు  సన్యాసులు కొనసాగించారు. 
   శ్రీనగరంనుంచి  బయలుదేరి  సుకృత, భట్టినేర, కంకార, వార్కోట, గులాటిరాలులు మకాములు  చేసుకుంటూ  హృషీకేశంలో  బయలుదేరిన  నాల్గవరోజు  ఉదయానికి  రుద్రప్రయాగచేరాం. రుద్రప్రయాగలో  మందాకిని అలకనందలో కలుస్తుంది.