పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాతో ఉన్న రెండువేల రూపాయలకు, వేయిరూపాయలు వెండి నాణేలు ఉంచి, ఆ రూపాయలు ఒక ట్రంకులో పెట్టి, ట్రంకుకు దిట్టమైన ఆగ్రా తాళాలు వేశాను. తక్కిన వేయి రూపాయలలో, 20 రూపాయలు కాసులక్రింద మార్చి ఉంచాను. నూరురూపాయలనోట్లు అయిదు ఉంచుకొన్నాను. వెండి చిల్లరగా యాభై రూపాయలుంచుకొన్నాను. తక్కిన నాలుగు వందల ముఫ్పై రూపాయలు కూలీలకు, కూలీల ఏజన్సీ వారికిచ్చాను. ఈ అయిదువేలు కాక మందులకని, భోజనసామగ్రులకని, పెద్దగూడారానికని, స్టవ్ కని, విద్యుచ్ఛక్తిటార్చీలకని, కిరసనాయిలుకని, మూడు చలికోట్లకు, రగ్గులకు, బనీనులకు, చేతితొడుగులకు, విద్యుత్ బాటరీలు రెండింటికి, సూదులకు, దారానికి, తళుకు గాజుపూసలకు, తళుకు నగలకు, వెండినగలు చిన్న చిన్న వానికి రెండువేల రూపాయలు ఖర్చుచేశాను. ఇందులో కొన్ని స్వామీజీకి కొనమన్నవి, తక్కినది నా ఆలోచన. నేను కొన్న మందులతో ఓ చిన్న ఆస్పత్రి పెట్టవచ్చును.

   హేమా, ఇవన్నీ   ఎందుకు  ఇంత  విపులంగా  రాస్తున్నానో  విను.  నాలో   ఉన్న  ఏదో  తీవ్రవేదన, గాఢాందోళనము  అణుచుకోడానికే  ఇవన్నీ  కొన్నాను. మందులజాబితా  ఇస్తే మరీ నవ్వుకుంటావు.  ఇవి  కొనేటప్పుడు   నా  తెలివితేటలు చుపించాలనే  అహంకారం  కూడా   ఉంది.  లేకపోతే  రకరకాల  ఇంజక్షన్లు,  మూడువిధాలైన ఇంజక్షన్ గొట్టాల  పెట్టెలూ,  ఆ  గొట్టాలకు  తగిన  అరడజను   సూదులు  కొనడం  ఏమిటి?  మాత్రలు, అరిష్టాలు, అసవాలు, లేహ్యాలు, తైలాలు-ఒకటేమిటి! ఒక చిన్న  ఆంగ్లవైద్యశాల   నాతో వచ్చింది. ఇలా  ఏ  మహారాజూ  ప్రయాణం   చేయరని  మా  స్వామీజీ   అంటూ  నవ్వుకొనేవారు. 
   బయలుదేరేముందు   హరిద్వారంలో  ఒక  డాక్టరుగారి  స్నేహమూ, ఒక  ప్రసిద్ధ ఆయుర్వేద  వైద్యుని  స్నేహమూ  చేశాను. ఆయుర్వేదవైద్యులు,  హిమాలయాలలో  ఆయుర్వేద వైద్యం  బాగా  పనిచేస్తుందని  ముఫ్పై రకాల  కుప్పెలు  ఇచ్చారు. మా  స్వామీజీకి  ఆంగ్లవైద్యమూ, ఆయుర్వేదవైద్యము కూడా  బాగా  వచ్చును.  ఆయన  ఒక్కమాటు  నన్ను   చూచి  చిరనవ్వు  నవ్వి  బాబా! భగవంతుని  నమ్మినవారికి  మందు  లెందుకయ్యా? అన్నారు.  నేను  వెంటనే  భగవంతుని  నమ్మినవారికి  మందులు  కావాలికదండీ! అన్నాను. స్వాములవారు  పకపక  నవ్వారు.
   
                                                                                                                   34
   ప్రతి  మకాములో  స్నానంచేస్తూనే ఉన్నా, నేను  గంగలో  మాత్రం  స్నానం  చేయటం  లేదు. ఇన్ని నీళ్ళు  కాచుకొని  స్నానం  చేసేవాణ్ణి. మాతో  వచ్చే  రాజపుత్రజమీందారు, ఆయన  వర్గమూ  నన్ను చూచి  ఆశ్చర్యం పొందారు.  ఎందుకీ  జంతువు మనతో?  అనే  ప్రశ్న వారందరూ  లోపల  వైచుకొన్నారు