పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

స్రోతంలో ఏకాంతవాసం చేసే ఋష్యాశ్రమాలు చాలా ఉన్నాయి. ఇక్కడనుంచి హరిద్వారానికి దక్షిణంగా కనఖలతీర్థం వెళ్ళాము. కాళిదాసు తన మేఘసందేసంలో ఈ నగరాన్ని అందంగా వర్ణించాడు. ఈ కనఖల పురం దగ్గిర పతితపావనేస్వర, తక్షేస్వర, తిలవథేశ్వర మహా దేవాలయాలున్నాయి. ఇక్కడే సతీకుండం ఉన్నది. సతి ఇక్కడ దక్షయజ్ఞశాలలో ప్రాయోపవేశం చేసింది. ప్రక్కనే దక్షేశ్వరాలయమూ ఉన్నది. ఇవన్నీ చూచుకొని భీమగోడాకు పోయాము. అక్కడ స్నానంచేసి హరిద్వారం వచ్చి రైలెక్కి పదిహేనుమైళ్ళ దూరంలో ఉన్న హృషీకేశం చేరుకున్నాము.

                                                                                                                    32
   
   హృషీకేశం  ఎంతో  విచిత్రమైన  పట్టణం.  అక్కడ  శ్రీరామ  మందిరము, భరతాలయాలను దర్శించినాము.  మా స్వామీజీ  మా  కోసం  చేసిన  సదుపాయాలు  అన్నీ  ఇన్నీ కావు.  ఎవరీ  స్వామీజీ? వీరు పూర్వాశ్రమంలో,  నెల్లూరు జిల్లా కావలిపుర వాసులు. వారింటి   పేరు  ధనికొండవారు.  వారి పూర్వాశ్రమం  పేరు  నారాయణరావుగారు. ఎం. ఏ; బి. ఎల్. పరీక్షలో  కృతార్ధుడై, నెల్లూరులో  న్యాయవాది పనిచేస్తూ, 1909లో  భార్య, ఇద్దరు  కుమాళ్ళూ, తండ్రీ ఇన్ ప్లూ ఎంజా జబ్బువల్ల మరణిస్తే, జీవితాన్ని రోసి, హిమాలయాలకు వచ్చి  బదరీ, కేదార, గంగోత్రి, గోముఖ  యమునోత్రి, సత్పథాతి  యాత్రలుచేసి  హృషీకేశంలో  అఖిలానంద  భారతీ   స్వాములవారి  శిషుడై, ఆశ్రమం  తీసుకొన్నారు.
                                                                                                                           
           
               

నారాయణరావుగారు ఉన్నంతకాలం తన కుటుంబం సంపాదన తప్ప ఇంకేమీ ఎరగడు. ఆశ్రమం తీసుకొన్న తర్వాత, సర్వకాలం తపస్సు, పఠనం ఇవి ఆయన పనులు. గురువులు వీరికి కైలాసనంద భారతీ యని నామకణం చేశారు. వీరు ఆశ్రమం పుచ్చుకొని ముందు కైలాస పర్వత సందర్శనమూ, మూడుసారులు ఆ మహాపర్వతానికి ప్రదక్షిణమూ చేసివచ్చారట. ప్రతి సంవత్సరమో, లేకపోతే రెండేళ్ళ కొక పర్యాయమో కైలాసానందులు, కైలాసయాత్ర చేసి వస్తూ వుంటారు. ఒక్కొక్కప్పుడు ఒక ఏడాదంతా కైలాసపర్వతం దగ్గర ఉన్న బౌద్దాశ్రమాలలో నివసిస్తూ తపస్సు చేసుకొంటూ ఉంటారు.

   కైలాసానందులు  సాంగవేదులై,  ప్రస్థానత్రయశాంతి  చేశారు. భాష్యత్రయం  గళగ్రాహంగా  వచ్చును. పాంతజలం  మొదలైన  యోగగ్రంధాలు క్షుణ్ణంగా  వచ్చును. తపస్సువల్లనో  ఏమో  వారికి  ఏకసంధా  గ్రాహిత్యం  అతి సులభంగా అబ్బింది. షడ్డర్శనాలు, మతేతర  దర్శనాలు పూర్తిగా వచ్చును.  రామక్రిష్ణ  మఠంవారి   గ్రంథాలు,  సత్సంఘ గ్రంథాలు,శిక్కుమతస్థుల గురు  గ్రంథ  సాహెబ్జీ ఉప