పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కుండం. ఇక్కడ బంగారు వెండి పాత్రలలో అస్తులు కలుపుతారు. బ్రహ్మ ఇక్కడ తపస్సు చేశాడు. ధర్మాంగదుడు పామై ఉన్నప్పుడు అతని భార్య అతన్ని ఇక్కడకు తీసుకువచ్చి స్నానం చేయించగానే, అతడు శాపంపోయి అందమైన రాజకుమారుడయ్యాదట. ఈ కథ నిజమై ఉండాలంటాడు మా వెర్రి సుబ్బులు. తల్లీకుమాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కామించుకోగానే కుష్టురోగులయ్యారట. అప్పుడు బుద్ది వచ్చి దేశాలు తిరిగి తిరిగి ఈ బ్రహ్మకుండలో స్నానం చేసేసరికి, వారి పాపాలు క్షయమై యథారూపాలు పొందారట.

   గంగానది  ఇక్కడ  రెండు  పాయలౌతుంది;  ఆ  చీలికలను  ధార అంటారు. చండీపర్వతం.  ప్రక్కనే  దక్షిణంగా  ప్రవహిస్తుంది. రెండవధార  శివాలిక్ పర్వతం  ప్రక్కగా వచ్చి, హరిద్వారం, మాయాపురం, కనఖల పట్నం పవిత్రంచేసి,  చండీధారతో  కలుస్తుంది.  ఈ  ఉత్తరధార  శివాలిక్ పర్వతాన్ని  స్పృశించినచోట  బ్రహ్మకుండం ఉంది. బ్రహ్మకుండం  దిగువగా  గంగాద్వారాలయం, హరిచరణఘట్టం  ఉన్నాయి.  గంగ  విష్ణుపాదజ  అనే  భావానికి  చిహ్నం ఈ  హరిచరణ  ఘట్టం.  భారతదేశంలోని   సంస్థానాధీసులు  ఈ  రోజులలో  క్షేత్రాలన్నిటా  మెట్లు,  ఇనుప  గొలుసులు  మొదలైన  అనుకూలా  లెన్నో  చేశారు.
   బ్రహ్మకుండానికి  దక్షిణంగా  గోఘట్ట తీర్థముంది.  గోహత్యాపాతకం  పోతుండట. దత్తాత్రేయ  మహర్షి  ఇక్కడే  తపస్సు  చేశాడట. ఆ  తర్వాత  కుశాతీర్ధముంది. తర్వాత  విష్ణుతీర్థము, తర్వాత  బిల్వపర్వతము,  ఇంతటితో శివాలిక్  పర్వతం  ఆఖరు. ఇక్కడ బిల్వకేశ్వరుడు  వెలిసి  ఉన్నాడు. మయాపురం దగ్గిర  గణేశతీర్థము,  నారాయశిల తీర్థము  ఉన్నాయి. చండీ  ధార  ప్రక్కనున్న  చండీపర్వతం  మీద  చండీ  దేవాలయం ఉంది.  పర్వత పాదం కడ  గౌరీశంకర  దేవాలయం  ఉంది. అక్కడే  ఇల్లేశ్వర  దేవాలయం ఉంది. హరిద్వారానికి ఎదురుగా  ఈ  చండీపర్వతముంది.
   మా  సుబ్బులు  నన్నీ  తీర్థాలన్నీ  తిప్పాడు. మా  అమ్మగారు  అన్ని దుఖాలు  మరచిపోయి, నేను   కైలాసం నుంచి   తిరిగి వచ్చేవరకూ  ఇక్కడే ఉందామనుకొన్నది. కాని  స్వామీజీ  ఆవిడ  హరిద్వారంలో  ఉన్నంతకాలం  ఉండి, భట్టిప్రోలు  మాత్రం  వెళ్ళాలని  ఆదేశం ఇచ్చారు.
   స్వామీజీని  కలుసుకొన్న పదవరోజున  మేమంతా  భీమగోడాతీర్థానికి వెళ్ళాము.   ఇదే  మా  కైలాస  యాత్ర  ప్రారంభం.  మా  అమ్మగారూ, సుబ్బులూ  హృషీకేశం  వరకూ   వస్తారు.  అక్కడ  మేమంతా  మూడురోజులుంటాము.  ఆ  తర్వాత  హిమాలయం ఎక్కుతాము.  ఇది  మా  ప్రయాణం  ఏర్పాట్లు. మా  యాత్ర  సాగిన  తర్వాత  కూడా   మా  అమ్మగారూ, సుబ్బులూ  కొన్ని రోజులు  హృశీకేశంలో  మకాంచేసి,  హరిద్వారం  వెళ్ళి  అక్కడ  ఇంకా కొన్ని రోజులుండి, ఇంటికి వెడతారు.
   మొదట సప్తస్రోతతీర్థము వెళ్ళాలి. హరిద్వారానికి  మూడుమైళ్ళు  తూర్పుగా  వెళ్ళాలి. ఇక్కడ  గంగానది  ఏడుపాయలుగా  చీలింది.  సప్త