పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కాశ యానం చేయిస్తాడు. నీ ప్రవాహ రహస్య గాథను అవగతం చేస్తాడు అని అస్పష్టవాక్కులతో అనుకున్నాను.

                                                         నీవు పుట్టెదవోయి!
                                                          నీవు నడచెదవోయి! 
                                                          నీలోన ఝురులుగా
                                                          నీలోన  వరదలై
                                                          నేనే  ప్రవహింతునోయీ!అని గంగ  పాడినట్లయింది.                                                                                                                           
           
               

వారిద్వారం చేరుకున్నాము. మా అమ్మగారు కాశీలో, ప్రయాగలో, బృందావనంలో, గోవర్ధనంలో, హస్తినాపురంలో, లక్నోలో, అయోధ్యలో మనుష్యుల సంపర్కం ఎక్కువ. కాని హరిద్వారం వచ్చేసరికి దేవతా సంపర్కం కలుగుతున్నది అన్నది.

   హరిద్వారానికి  పూర్వపు పేరు  మాయావతి. మాయావతి పట్టణ శిథిలాలు  ఇప్పటికీ  చూస్తే  హరి ద్వారానికి  సంబంధించే కనబడుతున్నవి.  పట్టణంలో  కొంతభాగాన్ని  మాయాపురి  అనే పిలుస్తారు. హరిద్వారంలో  గంగానది  అందమే వేరు. గంగానదిలో  మాత్రు భావం  పొంగిపోతూ ఉంటుంది. యమునలో ప్రియురాలి భావం  పరవశత్వం కలిగిస్తుంది. గంగ జ్ఞాన  స్వరూపిణి, యమునా  ప్రేమస్వరూపిణి.  అంతర్వాహినియై, సరస్వతి విజ్ఞానరూపిణి. పూర్ణగంగామాయి తేజోరూపిణియై, ప్ర్తాపంచిక  పథాల విహరించడానికి అవతరించిన మోక్షదేవి అన్నారు మా  స్వామీజీ.
   హరిద్వారంలో   హిందువులు  కానివారు  ఆస్తి  సంపాదించకూడదు. ఒక్క  మసీదుగాని, చర్చిగాని  హరిద్వారంలో  లేవు.  హరిద్వార పట్టణ  సరిహద్దులలో  మాంసము  తినరాదు.  చేపల పట్టరాదు.  పక్షుల హింసింపకూడదు.   సారాయి మొదలైన  మత్తుపదార్దాలు  పట్టణంలోకి రారాదు.  ఈ  నిబంధనలన్నీ  ఇతర  పుణ్యస్థలాల్లో లేవు.  నేను సిగరెట్లు  పట్టణం బైటనేకొనుకున్నాను. ఇచట  బ్రహ్మచర్యాశ్రమాలు  ఎన్నో  ఉన్నాయి. ఇక్కడనుండి  యాత్రికులైన  స్త్రీ పురుషులు  కామసంపర్కం  వదలివేస్తారు.  హిమాలయ  వాసులకే  అది  ఆరోగ్యకరమటగాని, ప్రయాణీకులకు  రోగకారణ  మౌతుందట. వేదాధ్యయనం  ప్రతిచోటా   వినబడుతూ  ఉంటుంది. ఇక్కడ  ఉచ్ఛారణ వేరు. మన  ఆంధ్రుల  ఉచ్ఛారణమే  స్పష్టంగా, సలక్షణంగా  ఉంటుంది. వానప్రస్థాశ్రమాలు,  గురుకులాలు, ఆయుర్వేద  కళాశాలలు  ఎన్నో ఉన్నవి.
   మేము  మదరాసీ  ధర్మశాలలో మకాం పెట్టాము. మా  సుబ్బులుకు  ఈ  పట్టణం  కన్నుల  వైకుంఠంగా  ఉంది. వాడి  ఆనందం  వర్ణనాతీతం. గంగాద్వార దేవాలయం  ఉండేదని  హుయన్  త్సాంగు  వ్రాశాడు. ఆ  దేవాలయం  ఇప్పటకీ  అక్కడ  ఉన్నది. గంగాద్వారం  తర్వాత ప్రసిద్దికెక్కిన  స్థలం బ్రహ్మ