పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

టాను అంటూ కన్నీళ్ళు తిరుగుతుండగా కళ్ళుమూసుకొని ఆశీర్వచన హస్తం చాపి నిల్చుని ఉంది,పిమ్మట నా తల, హృదయం, భుజాలు, మోము తడివి, పెదవులు కదుపుతూ నిశ్శబ్దంగా ఆశీర్వదిస్తూ నాన్నా వెళ్లి సర్దుకోఅన్నది.

   మా  ప్రయాణం ఏదో కొత్తలోకంలో  వలె పదివేల అడుగుల  ఎత్తున వుంటుంది, పదిహేనువేలు, ఇరవైవేల అడుగులవరకూ  ఎత్తు  పెరుగుతూ ఉంటుంది. హిమాలయాలను  తలచుకొంటూ, మా  అమ్మను  తలచుకొంటూ  గంగ ఒడ్డుకు వెళ్ళి కూర్చున్నాను. గంగామాయీ, మా అమ్మా  ఒకటిగా నాకు తోచారు.  నా  హృదయకలశం   ఏవో  వింత భావాలతో  నిండి  పోయింది. యేవో   తెలియరాని   వేదనలు, అర్ధంకాని  కాంక్షలూ, తెరచాటున ఉన్న   మూర్తులూ, నా  జీవితాన్ని  మూలమంటా   కదల్చివేస్తూ  ముందుకు వచ్చినట్లయింది.
   ఎవరి  బాధలు ఎవరికీ తెలుస్తాయి? ఆవేదనలు కాని, ఆనందాలు కాని  వ్యక్తి సంబంధమైన  గోప్యాలు. నేను  ఈ  ప్రపంచంలో  ఒక్కణ్ణే అయిపోయాను. దుఖంకానీ, సంతోషంకానీ, ఆవేదనకానీ అవి ఎవనిలో ఉద్భవించాయో  వానికే  తెలియకుండా  ఉంటాయి కాబోలు. అవి వ్యక్తం చేసుకున్న  కవీ, చిత్రకారుడూ, ప్రతి  సహృదయుని హృదయంలోనూ పతిద్వనిస్తారు. ఇదే  కాబోలు  వ్యక్తిగత  సృష్టిలోని  విశ్వత్వము.  ఆ  అఆలోచనలో  నాకు కృష్ణశాస్త్రి ఆవేదన అర్ధమైంది. ఆ మహాకవి  మధురుమైన  ఆవేదన  అంతా  అందుకోలేని  సౌందర్యం కోసం, ఆనందం కోసమే కదా! మహాకవీ నువ్వూ నావలెనే  వేదన పడ్డావా?  
   మనుష్యుడు  కోరే  ఆ  సౌందర్యం  ఏమిటో? అది స్త్రీ  స్వరూపంగా ఎక్కువ  సన్నిహితం కావచ్చును. అంతకు తక్కువ, ప్రకృతి సౌందర్యం కావచ్చును.  వీటికి  కొంచెం తక్కువగా మానవజీవిత  సౌందర్యం కావచ్చును.  కాని వీటి  అన్నిటినీ  మించిన  దేనికోసమో  మనలో  ఈ  ఆవేదన సర్వకాలమూ  ఉంటుంది. ఆ  ఆవేదన  మన బ్రతుకుకు  సన్నిహితంగానూ, అతీతంగానూ కూడా  ఉంటుంది.  ఈ  ఆవేదననే  విశ్వనాథ  సత్యన్నారాయణ కవి  సమ్రాట్టు  శ్రీకృష్ణనిర్వేదంగా  పాడాడు. ఈ  ఆవేదన  రసస్వరూపం తాల్చబోయే  దోరపండువంటి  భావం. పండగానే కావ్యం అవుతుంది. ఏవో  నా భావాలు   నా  తల  త్రిప్పివేసినవి. ఎదుట కేదారగౌళ పాడుకుంటూ  గంగానది  ప్రవహిస్తుంది.  గంగానదీ! నీలో  వున్న ఆవేదన ఏమిటీ  అని  ప్రశ్నించాను. అలా  సంతతజన్మయై, సంతత  వేగవతియై, సంతత జీవితయై, సంతత మరణయై, ఏదో మహాభావము సర్వవిశ్వానికి ప్రసరింపచేస్తూ ఉంది.
    గంగానదీ  నీ రహస్యము  నేను నీ దారి పొడుగునా ప్రయాణించి, నీ  పుట్టుపూర్వోత్తరాలు  గ్రహించి   నాలో  నీ ఘురీవేగ రాగిణీ స్వరాలాపన  శ్రుతిని  లయింప చేసుకుంటానమ్మా!  నువ్వూ, మా  అమ్మే  నా  ప్రపంచం. నా కింకేమీ అక్కరలేదు. ఈ  స్వామీజీ  నా  చేయి పట్టుకుని  నీ  మాతృహృదయా