పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తికీ ఏమి సంబంధం ఉంది?

   లోకేశ్వరి మంచంమీద  లేచి కూర్చున్నది.
                                                                                                                           
           
               

హేమా! ఎంతసేపయింది నువ్వులేచి?

    చాలా సేపయింది. కథ మళ్ళీ చదవడం  ప్రారంభించాను.
    కళ్ళు  విప్పగానే  నిన్ను  చూచి అదే అనుకున్నాను. నాకు మాత్రం వెఱ్ఱినిద్ర  పట్టింది. యింకా  మత్తు వదలలేదు. కాసేపు  నిద్రపోతా. నువ్వు  పుస్తకం పూర్తికాగానే లేపుతావు కదూ?
   ఈ  ముక్కలంటూనే లోకేశ్వరి  ప్రక్కమీద  వాలిపోయింది. పడుకున్న పదినిమిషాల్లో లోకేశ్వరి నిదురకూరిందనే  హేమ  భావించుకుంది. కాని లోకేశ్వరికి  నిదురపట్టలేదు.  ఆమె అతిగాఢమైన   నిద్రలో  మునిగి పోయినట్టు నటించడం ప్రారంభించింది.
   హేమసుందరి  త్యాగతికథ   మళ్ళీ తీసింది. మళ్ళీ సోఫాపై  నుంచి లేచి వెళ్ళి కూజాలో  నీళ్ళు తాగివచ్చి,  చదవడం ప్రారంభించింది.

   
                                                                                                     o           o           o
   స్వామీజీ  బోధనలు వింటూ మా అమ్మ   హరిద్వారంలో   వారం రోజులు  ఉంది.  నేను  కైలాస  ప్రయాణానికి   వలసిన  సన్నాహాలన్నీ  స్వామీజీ సలహా  ప్రకారం  చేయడం  ప్రారంభించాను.
   వేడికి ఉన్ని దుస్తులు  కుట్టించుకున్నాను. చేతులకు  తోలు తొడుగులు  కొనుక్కున్నాను. దారిలో భోజనానికి వలసిన  సామగ్రి  సేకరించాను  మాతో  వచ్చేందుకు  ఒక  లేప్చాను  మాట్లాడుకొన్నాను. హృషీకేశం  వెళ్ళగానే  అక్కడ  మా  సామాను  మోసుకువచ్చేందుకు  హిమాలయపు  పొట్టి గుర్రాన్ని  ఏర్పాటు  చేసుకున్నాను. సిగరెట్లు, చుట్టలు, అగ్గిపెట్టెలు  దిట్టంగా  సేకరించాను. ఒక డబ్బా కిరసనాయిలు ప్రైమస్ స్టవ్ నూ కొన్నాను.
   నా  యాత్రాసంరంభం చూస్తూ  స్వామిజీ   నవ్వుకుంటూ ఉండేవారు. ఢిల్లీకి వ్రాసి ఒక చిన్న  డేరా  ఖరీదుకు తెప్పించుకున్నాను. ఆ  డేరాకు రెండు గుఱ్ఱాలు  అదనంగా  మాట్లాడాలట. ఒక చిన్న  మహారాజుకైన ఖర్చు అయినది. నా  సరంజామా  పూర్తికాగానే  మేమంతా హృషీకేశ్   నగరం  వెళ్లాము. 
   మా తల్లి  కుడా నాతో ప్రయాణమయితే  స్వామీజీ వద్దన్నారు. అందుకు చాలా కారాణాలున్నాయన్నారు. మా  అమ్మ  స్వామీజీ  ఉపదేశ  ప్రకారం  హృషీకేశ యాత్ర  పూర్తిచేసుకుని  గయ, కలకత్తా, పూరీలమీదుగా భట్టిప్రోలు వెళ్ళడానికి నిశ్చయం  చేసుకున్నది. మా అమ్మ  నన్ను తన గదిలోకి  రమ్మని, నాన్నా! నాకు నువ్వు  నమస్కారంచేసి  చాలా రోజులయింది రా. ఒక్కసారి నాకు నస్కారం చేయరా! అన్నది.
   మా  అమ్మగారి  ప్రేమ పోగిపోయి, నన్ను ముంచెత్తింది. కరిగిపోయిన  హృదయంతో  అప్రయత్నంగా, నేల సాగిలబడి,  ఆమె పాదాలు రెండు  స్పృశించాను. దీర్ఘాయురస్తు. బహుసంతాన  ప్రాప్తిరస్తు. నాన్నా! నువ్వు తిరిగి వచ్చేవరకు నా పంచప్రాణాలు నీతోనే  ఉంటవి. ముందు సంవత్సరం మనమిద్దరం  వేసవికాలంలో మళ్ళా హిమాలయ  యాత్రలు చేద్దాము. ఇప్పుడు నేను జగన్నాథం మీదుగా భట్టిప్రోలు  వెళ్ళి,అక్కడ  నీ కోసం  ఎదురు చూస్తుం