పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రంగులలోనే గంధము చూస్తిని

                                                      సద్గురురాయా ఎటువంటి కలగంటినీ
   అని  మా గురువుగారు  పాడినట్లు  నీ  బ్రతుకు ఒక  పాడు కల అయింది  బాబా!
   సన్యాసి  మాటలు  వింటూంటే  నా  కాశ్చర్యము  కలిగింది. ఇవన్నీ  మా  అమ్మ ఆయనకు  చెప్పిందనుకున్నాను. అమ్మా, మా  సుబ్బులు ఆయన కేసి తెల్లబోయి చూస్తున్నారు. ఉన్నట్టుండి మా అమ్మ  ఆయన  కాళ్ళమీద పడి   స్వామీ  మా అబ్బాయిని  రక్షించండి బాబూ!  అని వాపోయింది.
   
                                                                                                                     30
   ఆ   స్వామి   తనతో  మమ్మల్ని తమ  ఆశ్రమానికి  తీసుకుపోయారు.
   ఆ ఆశ్రమంలో  అయిదారుగురు  స్వాములున్నారు.  అందులో ఇద్దరు  గోసాయీలు. స్వామి మమ్మల్ని  తన నివాస భాగంలోనికి  తీసుకుపోయి  అక్కడ  ఉన్న  కృష్నాజినాలమీద  మమ్మల్ని  కూచోమని, తాను లోనిగదులలోనికి వెళ్ళారు. మేము  ముగ్గురము మాటలు లేకుండా ఆ చాపపై కూర్చున్నాము. ఇంతవరకు    నా  స్థితి  ఇలాంటిదని  చెప్పలేను.
   నేను గతంలో ఉరుకుతూండగా  తానూ, మా  అమ్మ గంగ  వడ్డుకు పరుగెత్తుకు వచ్చామనీ;  అలా పరుగెత్తుకు  రావడానికి  కారణం, నా ప్రక్క మీద నేను లేకపోవడమేననీ:  నేను  గంగలో ఉరికి  ప్రాణం తీసుకుంటాననీ  వాళ్లకు  భయంవేసే వచ్చారనీ:  వాళ్ళు వచ్చీరావడంలో  ఈ  స్వామి  గంగలో నీ వెనకే  ఉరికి నన్ను  నిమిషంలో   ఒడ్డుకుచేర్చడం  చుశామనీ; నేను పది నిమిషాలు ఒళ్ళు తెలియక     పడి  ఉండడంచూచి, మా    అమ్మ  ఘొల్లున ఏడ్చిందనీ; ఆ    స్వామి మా  అమ్మతలపై  చేయివైచి  అమ్మా! నీ  కుమారునికి  ఏమీ  భయంలేదు. అతని జీవితం పూర్తిగా మారిపోయి, మళ్ళీ  యధాప్రకారమవుతాడు. అతని భవిష్యత్తు  భాగుంటుం'దని  చిరునవ్వుతో  ధైర్యం  చెప్పారనీ, ఇంతలో  నేను కళ్ళు తెరిచాననీ  దారిలో సుబ్బులు నాకు చెప్పాడు.
   నా కిదంతా  ఆశ్చర్య  మనిపించింది. ఎవ్వరీ   స్వామి? ఆయన్ని చూచేంతలో  నాకూ  ఏదో  శాంతి కలగడమేమిటి?  ఇదంతా నాలో అణిగి ఉన్న  నీరసత్వమేనా? నా ఆవేదన ఓ వెఱ్ఱి  బోడిగుండుస్వామి అన్న మాటలతో  చల్లారిపోవడమా? నా  హృదయం  అందుకు  సంసిద్దపడి ఉంది కాబోలు. ఇన్ని యుగాలనాటినుంచీ  ఉన్న  ఈ  మూర్ఖభావాలు  ఒక్కసారిగా  పోతాయామరి?  కాషాయాంబరాలు  ధరించు   ఓ   మాయకాడు  కంటబడగానే, సాష్టాంగ   దండ ప్రణామాలు చేయడానికి  అందరమూ సిద్దమౌతాము. అలవాటు చేసుకొన్నవాడికి ఎదుటివారి  హృదయం   నిమిషంలో అవగతం  అవుతుంది. ఈ  సన్యాసులు  ఆ  విద్యలో  పరమ ప్రవీణులు. ఆ   గంగలోపడి  నా  శకుంతలతో  పోనీక  ఈతడు నన్ను  రక్షించడ మేమిటి?