పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వికసించాయి! ఆ నవ్వు పెదవుల ప్రక్క సొట్టలలో ఎన్ని పూవులు ప్రోవులై కురిసిపోయాయి. ఆమె నా ఎదుట సిగ్గులేక ఆ నీళ్ళలో భయంలేక చీర విప్పి, చేతుల్తో చుట్టచుట్టి ఆ ప్రవాహానికి అర్పించివేసింది. ఆమె ఆ దెపమెలతో నెమ్మదిగా నా వైపుకు రాసాగింది. ఎందరో స్త్రీలు , పురుషులు ఆ హరిచరణఘట్టం మూగిపోతున్నారు. ఆమె ఘనవక్షోజద్వయ మప్పుడే నీటి బయటకు వచ్చింది. అమ్మయ్యో! శకుంతలా! తప్పు తప్పు అంటూ ఆ నీళ్ళల్లో ఆమెవైపు ఉరికాను. శకుంతల దీనహస్తాలుపరుస్తూ, వెనక్కుపోవడం ప్రారంభించింది. ఆమె కంఠంవరకు పోయింది. గడ్డం మునిగిపోయింది. పెదవులు మునిగిపోయాయి. నేను రెండు బారలలో అక్కడకుపోయాను.

   నా శ........కుం........త....ల  మునిగిపోయింది. నేనా ప్రవాహంలో  ఆమె దగ్గరకుపోయి, ఆమె  మునిగిన చోట  మునిగి, పైకితీసి  రక్షించుకోవాలనే  ఆతురతతో  ఒక్క  ఉదుటున  అక్కడకు పోయి  ఉరికాను. ఆ  తర్వాత  ఏం  జరుగుతుందో  నాకేమీ  తెలియదు........
    బాబా! నీ  శకుంతల  కోసమే  అల్లా  ప్రాణాలు  తీసుకోవడమే?   అని స్పష్టంగా తెలుగుభాషలో  ఓ  సన్యాసి  నన్ను ప్రశ్నించాడు.
   నేను లేచి  కూర్చుండి   నా  శకుంతల  ఏది?  ఆమె  మునిగి పోయిందా? అయ్యో!  అన్నాను.
    బాబా!  ఎందుకట్లా  కంగారు పడతావు?  నీ  శకుంతల  లేనేలేదు.  నువ్వు  భ్రమపడ్డావు. నీటిలో  ఉరికావు.  నీ  చిత్తవృత్తే  నన్నిలా  చేసింది, నాయనా!
   నేను  నా చుట్టూ  మూగిన  జనాన్ని చూశాను.  మా  అమ్మ, మా  సుబ్రహ్మణ్యం నన్ను  పొదివి పట్టుకున్నారు. మా అమ్మ  దుఃఖంతో  వణికిపోతూ  కుంభవృషిలా  కంటినీరు  కారిపోతూవుండగా  నాకేసి  దీనదృష్టులు, ఆ  తలముసుగు  సందులోంచే, పరపుతూ  నన్ను కౌగలించుకొని ఉంది.
    బాబా! చుచావా  మీ  తల్లిగారి   దుఃఖము.  మీ   బావగారి   దుఖమున్నూ? నీకు  ప్రపంచం   మీదా,  భగవంతునిమీదా  ఎందుకీ   ప్రళయకాలం  వంటి కోపం ? నువ్వు  భగవంతుణ్ణి   అవమానం చేస్తే,  ఆ   భగవంతునికి   కోపం  వస్తుందనా  నీ ఉద్దేశం!  ఓయీ   మొరకుమనిషీ!   కోపం  నిన్నే దహిస్తూన్నది. నీ  చదువు  నీకు ఊరట  కలిగింపలేదు.  నీ  యాత్రలు  నీకు  శాంతినివ్వలేదు.  నీకు  స్త్రీ  తుచ్ఛమైన  వస్తువు   మాత్రం. నీ  భార్య   గనుక,   ఆమెను  నువ్వు  నీ   ప్రేమ  పాత్రమైన  కుక్క కన్న  ఎక్కువగా  చూచి అదే  ఒక దివ్య ప్రేమ అనుకున్నావు. ఆమె  దివ్య లోకాలకుపోతే , నీ  వస్తువు. నీ  స్వంత  ఆస్తి, నువ్వు అత్యంతగా ప్రేమించిన  నీ  ప్రేమ  నిధానంపోయిందని, భగవంతుని  మీద  మండిపోతున్నావు  అంతేనా?
                                                    సద్గురురాయా  ఎటువంటి  కలగంటినీ
                                                      నిర్గుణమందే  గుణముల రంగులు