పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాకు లోకంమీద కసి తీరలేదు. దైవం మీద కసి తీరలేదు. ఏమి చెయ్యను? దేవుడి గుళ్ళల్లో దొంగతనాలు చెయ్యనా? రాత్రిళ్ళు దేవుళ్ళ విగ్రహాలను ముక్కలు చేయనా? హరిచరణమట! హరిణనేత్ర చరణం కాదూ? స్నాన ఘట్టంలో రాతిమీద ఓ చచ్చు అడుగు చెక్కి, అది హరిచరణం అనేవాడు ఒక శుంఠ. అది చెక్కించినవాడు మరో శుంఠ. అది నమ్మి పూజించినవాడు అంతకంటె శుంఠ. ఈ శుంఠలందరు దేశాన్ని దద్దమ్మ, చచ్చమ్మ, కుంకమ్మ దేశాన్ని చేసి పాడుచేసి పారేశారు.

                                                                                                                  29
   హరిద్వారం వచ్చిన మర్నాడు తెల్లవారగట్ల  తిన్నగా  స్నాన ఘట్టానికి  పోయాను. ఏమిటా హరిచరణం?  దానికి  నా  చరణప్రహరణం  ఇస్తే ఏమవుతుంది?  స్నానఘట్టానికి వెళ్ళడంతోటే  అక్కడ  అప్పుడే స్నానం చేస్తూన్న  సాధువు లెవ్వరూ  చూడకుండా,   ఇతర  దొంగభక్తు లెవ్వరూ  కనుగొనకుండా హరిచరణాన్ని  నాలుగు తన్నులు  తన్నాను. ఏమి చేయగలిగిందా చరణం? విష్ణుచక్రం రాలేదే? గరుత్మంతుడు  తన్నుకుపోలేదే? పాంచజన్య   శంఖారావాలు   భూనభోంతరాళాలు     వ్రక్కలు చెయ్యలేదే? లోకం తలక్రిందులు  కాలేదు, సముద్రాలు పొంగిరాలేదు.  మిన్ను  విరుచుకు పడలేదు. నక్షత్రాలు  డుల్లలేదు. హ్హా! హ్హా! హ్హా! ఓయివెఱ్ఱి  విష్నుపదమా! నన్నేం  చేస్తావు. నువ్వు  నువ్వా దద్దమ్మ పంగనామాల   వాళ్ళను  ఏడిపిస్తావు?  నన్నేం  చేయగలవు?  నాకు నువ్వంటే  భయమా?                                                                                                                           
           
               

వికటహాసంతో వచ్చి మెట్లమీద కూర్చున్నాను. నా ఎదుట శకుంతల నీళ్ళల్లో స్నానమాడుతున్నట్లు కనిపించింది. ఇదేమిటి! నా శకుంతల ఎక్కడనుంచి వచ్చింది? కళ్ళు నులుముకుని చూచాను. ఆమె అక్కడనే స్నానం చేస్తూంది. లోతు అని భయం లేకుండా నిర్భయంగా స్నానం చేస్తూంది. నేను చూస్తుండగానే తన రవిక విప్పి నీళ్ళల్లో పడవేసింది. అది గంగా ప్రవాహంలో కొట్టుకుపోయి మాయమైపోయింది. శకుంతల కట్టుకున్న చీర, ఆ కొట్టుకుపోయిన రవిక, ఆమె పూజించిన రోజున నేను అర్పించినవే!

   ఆమె  నిర్భయంగా  అంతలోతు నీళ్ళలో  ఆ  ప్రవాహవేగా  వర్తములలో మునుగుచు  తన ఘన  కచభారాన్ని విప్పి  ఆ  సౌభాగ్యం గంగానదికే  అందం ఇస్తూండగా  స్నానం  చేస్తూంది. నాకు  శకుంతలా  అని పిలవడానికి  మాట రాలేదు.  కఱ్ఱలా, రాయిలా, మొద్దులా, ఆ  మెట్లమీద  అలాగే కూర్చుండిపోయాను.  ఆమెరెండుమూడు సార్లు వెనక్కు తిరిగి  నన్ను చూచి, చిరునవ్వు నవ్వింది. ఆ  నవ్వులో  ఎన్నికోట్ల  సౌందర్యాలు  నర్తించాయి!  ఆ  మందహాసంలో  ఎన్ని వెన్నెల్లు