పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జాగ్రత్తతో అలంకరించుకుంటాడు. క్రీములు, పౌడర్లు, సెంట్లు రాసుకోవడంలో నాతో సమానమైన చెయ్యి. సిల్కులలో మునిగి, సిల్కులలో తేలుతాడు.

"కల్పమూర్తితో సమానమైన చెయ్యి టెన్నిసులో, బేస్ లైన్ ఆటలో ఇతన్ని మించినవారు లేరు. " చాపింగ్ " లో " హాఫ్ వాలీ " లో మహా మాంత్రికుడు. మా స్నేహితులు చాలామంది ఇతని ఆటని " జిడ్డు ఆట " అంటారు. గంటలకొద్దీ, సునాయాసంగా, చమటతో షర్టు సుంతయినా తడవకుండా టెన్నిసు ఆడగలడు. తాను "పాయింటు"తియ్యలేడు. ఇతర్లన్నీ తీసుకోనివ్వడు. ఇతన్ని నెగ్గాలంటే " స్మాష్ " తోటి, " నెట్ డ్రాఫ్" లతోటి, నెగ్గవలసిందే. ఒక్క కల్పమూర్తి తప్ప ఇతన్ని తెన్నిసులో గెల్చేవారెవ్వరూ లేరు.

తీర్ధమిత్రుడు కవిగాదు.కాని కవిత్వంలాంటి పాటలు అప్పటికప్పుడు కల్పించి పాడుతుంటాడు. వీళ్ళ పాటలోంచి ఓ పాదం, వాళ్ళ పాటలోంచి ఓ పాదం కలేసి విచిత్రమైన రుచులు అందిస్తుంటాడు. ఎవరైనా అతనికి కొత్తలేదు. ఎలాంటి వాళ్ళతోనై నా నిమిషంలో స్నేహం చెయ్యగలడు.

                                                                                                   5
      

ఇంక, త్యాగతీశర్వరీ భూషణుడు కురూపీకాడు, అందమైనవాడూ కాడూ ఆలోచిస్తే అన్నీఅందమైన రేఖలే, అన్నీ చక్కని వట్రువలె. విలక్షణమైన విచిత్రమూర్తిత్వము అతని శరీర సౌష్టవములో ఉన్నది, అతన్ని మరవలేము. అతన్ని " త్యాగతి " అని మాత్రం పిలుచుకుంటాము.

నవ్వడు, నవ్వుకన్న విలాసమయినదేదో అతని పెదవుల్లో నాట్య మాడుతూంటుంది, అతని ఫాలన అతిగంభీరకాసారని శ్చలత గోచరిస్తుంది.

అతని మూర్తిలో ఏవో భావాలూ, ఏదో తీక్షత, ఏమో నమ్రత ప్రత్యక్షమవుతూ ఉంటవి.అతని కళ్ళు చిన్నవీ కావు; పెద్దవి కావు; కనుబొమ్మలకు దిగువగా లూతుగా ఉంటవి. అయినా వాటి మూర్తి మాత్రం అతి అందమైన తామర పువురేకలు, కనురెప్ప వెంట్రుకలు చాలా పొడుగు. కళ్ళలోని నీలిపాపలు స్పస్టమైన వర్ణము కలవి. ఆ కంటి పాపల్లో ఏవో వెలుగులు ఎప్పుడూ నాత్యమాడుతూంటవి. ఆ కళ్ళ ముందర ఎవ్వరూ అబద్దాలు చెప్పలేరు. అసత్యము ఆలోచింపలేరు. అతని చూపుల యెదుట నా హృదయం నగ్నమూర్తి అయిపోతూంటుంది.

త్యాగతి ఎప్పుడూ మాట్లాడడు. మాట్లాడాడా రెండు ఎత్తయిన కొండల మధ్యనుంచి ప్రవహించే మహానదుల గంభీరద్వనిలా ఉంటుంది.రాత్రి పన్నెండు గంటలకు నిశ్శబ్దంలో వినవడే సముద్ర ఘోషలా ఉంటుంది సెల్లో వాద్యం మందరం తీగలా ఉంటుంది. ఏ సంభాషణలలో నన్నా అతడు ఒక్క మాట చెప్పితే ఇంకెవ్వరూ జవాబు చెప్పలేరు. అందరూ నిరుత్తరులై పోవలసిందే. త్యాగతి అంటే నాకు భయం, భక్తి కూడాను.