పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పోలీసు సూపరింటెండెంట్లు, డిప్యూటీ సూపరింటెండెంట్లు, ఎక్సైజు అసిస్టెంటు కమీషనర్లు, యినస్పెక్టర్లు_ఈ జాబితాకు అంతులేదు_అతని స్నేహితులు.

తమ తమ ప్రయాణాన్ని నాకు తెల్పడంలో నిశాపతికీ, కల్పమూర్తికీ చాలా తేడా ఉంది. " నీ అందం ఓ లక్ష గులాబీల పోగు హేమ సుందరీ దేవీ! నీ కళ్ళలోని గాటపుదమి నా కంఠంలోని అతి గభీరాలను గాన మధువుతో అంచులంటా నింపగలదు, మోహనమూర్తీ!" అంటాడు నిశాపతి.

" హేమా! నా సర్వస్వమూ నీది. సౌందర్యానికి నిగ్గులుదీర్చే దేవతా స్త్రీలు నీ ముందర వికారంగా ఉంటారు. మా అమ్మ నీవు ఎప్పుడు కోడలుగా వస్తావో అని కలవరిస్తూంది. ఈ కాలంలో చదువుల తేడాలు పరిగనించవలసిన అవసరం....అవసరం....లేదని నా మనవి. అది నిజం కాదూ? కాదూ! " అని అతి విశ్వాస పూరితమైన వృషభనయనాలతో నా పాదాలు పూజిస్తూ మోకరిల్లుతాడు కల్పమూర్తి.

   4                                                                                              

కల్పమూర్తి నీడలా వస్తాడు తీర్ధమిత్రుడు. తీర్ధమిత్రుడు కర్పూర శలాక లాంటివాడు, ఆడదాని సౌందర్యమాతనిది. కళ్ళు కన్నన్ బాల కళ్ళలా నవ్వుతవి: కాంచనమాల కళ్ళలా కాంక్షిస్తవి: పుష్పవల్లి కళ్ళలా పులకరాల పూజలు సమర్పిస్తవి. ఎప్పుడూ నవ్వుతూంటాడు. ఉంగరాల అలకలు తేలు జుట్టూ, చిన్న ఫాలమూ, గుండ్రని మోమూ ఎప్పుడూ నవ్బ్వుతూనే ఉంటవి.సమమైన ముక్కు, కాయ శరీరము, ఉజ్వల శ్యామల చ్చాయ, స్పష్టతతాల్చిన మూర్తి. మిట్ట మద్యాహ్నపు లేత రావిచేట్టులా ఉంటాడు, పొట్టివాడు.

తీర్ధమిత్రునితో నడిచివస్తుంది సంతోష దేవత. విషాదంలో కూలి పోయినవారు కూడ అతడు వచ్చేటప్పటికి సంతోషాకాసంలో తేలిపోతారు. అతని అడుగుల చప్పుడు వినేటప్పటికి నా హృదయంలో సంతోషరాగాలు ఉద్బవిస్తాయి. నా పని ఇంతైనా నన్ను చేసుకోనివ్వడు. అతడు సమీపంలో ఉంటే తోచకపోవటమనేది దగ్గఱకు రాదు. ఎన్ని గంటలయినా గణ గణ మాటలాడుతాడు. అతనికి ఒక్క విషయమూ తెలియదు, తెలియని విషయమూ లేదు. అతడు ఏ పుస్తకమూ చదవడు, అన్ని పుస్తకాలూ చదివినట్లు కనపడతాడు. ఏ పత్రికా చూడడు, పత్రికలోని వార్తలన్నీ చెపుతాడు.

తీర్ధమిత్రుడు సంగీత పాటకుడు కాడు. అయినా తియ్యగా పాడగలడు, తన పాటల్ని తాను హార్మోనియం మీద వాయించగలడు. వాయించుకుంటూ పాడగలడుగాని అతని గొంతుకలో లోతులు లేవు. రాచుకున్న పది నిమిషాలవరకు మాత్రం సువాసనవేసే అత్తరులాంటిది అతని గొంతుక.

"ఆడమ్మాయి" వలె మాట్లాడుతాడు. " ఆడమ్మాయిలా " నడుస్తాడు. మామూలు మాటల్లో కూడా అతని గొంతుక ఆడగొంతుకే. స్త్రీ సహజమైన