పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సాయంకాలం వరకూ నాకు విసుగూ, కేకలూ ప్రబలాయి. మా అమ్మపై కస్సు బస్సులు సాగించాను. ఆమె నే నెన్నన్నా ఎప్పుడూ నవ్వుతూ చాకిరి చేసేది, మా సుబ్బులు గంగిగోవులా ఏమీ మాట్లాడకుండా నాకు పరిచర్య చేసేవాడు. సేవకులమీద కోపం, బండివాళ్ళపై, కూలీలపై అందరిపైన కోపం, మా అమ్మ రహస్యంగా కంట నీరెట్టుకొనేదట. బక్కకోపం ఎక్కువైంది మా వాడి కని, అన్నీ భరించేది. మా అమ్మ.


   నే నిక  మస్సోరీలో  ఉండలేనురా అంటే మా సుబ్బులు కాశ్మీరం పోదామన్నాడు. కాశ్మీరం పోయాము.  అందరి కళ్ళబడే  షాలిమారు  ప్రమదావనం, డాలు సరస్సు, జీలంపై కాశ్మీరు  నౌకాయాత్రలకన్న, అక్కడ అనంతంగా  పండే  పళ్ళయినా  తినడానికి పైసాలేని  బీదవాళ్ళ   స్నేహం ఎక్కువయింది.  నా దృష్టి   ఎప్పుడూ  అందమైన  స్త్రీలమీదనే. ఎన్ని వస్త్రాలు  ధరించిన  జవ్వనినైనా నా  మనస్సులో  విగతవస్త్రను చేసి  ఊహిస్తూ, నా  నీరసత్వానికి పళ్ళు  కొరుక్కుంటూ ఉండేవాణ్ని.
   అయోధ్య  ప్రాంతాల  స్త్రీలు పట్టపగలు   ఆడవాళ్లచేత స్వల్ప  వస్త్రాచ్చాదితలు   మాత్రమై  వళ్ళు   వట్టించుకోడం  చూస్తూ నా రాక్షస హృదయానికి  ఆనందంగా  సమకూర్చుకున్నాను. అలాగే  ధనం ఇచ్చి, చక్కని పిల్లలను  శ్రీనగర్  గల్లీలలో  ఏరితెచ్చి,  అక్కడ  నా కేర్పడిన  నేస్తం  ఒక స్త్రీ  వ్యాపారిణి ఇంట్లో  రహస్యంగా  వాళ్ళను  దిగంబరం చేసి, ఆ  బంగారు  మాలామా  దేహాంగాలను తనినోవ  స్పృశిస్తూ  ఆనందం పొందేవాణ్ని. వాళ్ళూ తమ దేహాలు  కామతృప్తికి  బాలి యివ్వకుండా, ఆ బలివల్ల  వచ్చే  రుసుంకన్న స్పర్శానందం  ఇచ్చే  రుసుం  ఎక్కువగా  దక్కడానికి సంతోషిస్తూ, నాకు  సలాములుకొట్టి, నా చెంపలు  తాకి మొటికలు విరుచుకుని  వెళ్ళిపోతూ ఉండేవారు.
   ఈ  నా  పిచ్చిచేతలు మా  సుబ్బులుకు  చూచాయగా తెలిసాయి. ఓ  సాయంకాలం  నావపై తట్టుపైన  కూర్చుని  డాలు సరస్సులోని అందాలు  ఖాళీ చూపులతో చూస్తున్న నా దగ్గరకు మా సుబ్బులు  చేరాడు.
                                                            

ఒరే మూర్తి బావా! ప్రపంచంలో అనేక కష్టాలు పడ్డవాళ్ళూ ఉన్నారు. భార్యలు పోయినవాళ్ళూ ఉన్నారు. వాళ్ళు మతులు పోగొట్టుకుంటారురా! పోనీ ఏమీ తెలియని పిచ్చికాదు, ఇదేమి పిచ్చి నీకు?

    సుబ్బులూ, నా  వ్యవహారాలలో  నువ్వు జోక్యం కలుగజేసుకోకు. నేను చావడానికి  సిద్దంగా ఉన్నప్పుడు, మీ నాన్న  వచ్చి నన్ను  బ్రతికించాడు, ఆ  పని  నవ్వు పూర్తి చేసావు.  మామయ్యకూ,  నీకూ  నా దేహం వలిచి  ఇచ్చినా  బాకీ  తీరదు. నిజమే. అంత మాత్రాన  నా  జీవితానికి   మీరు నాథులు కారు, నేను  మీకు బానిసను  కాను.
   అల్లా  నువ్వు  మాట్లాడితే, నేనేం చెప్పను?
    నువ్వేం  చెప్పక్కరలేదు. నేను వినక్కరలేదు. లేనిపోనివన్నీ కలుగజేసుకొని  నాకు  ఈ  కాస్త  సంతోషం  లేకుండా చేయకు.