పుట:Thobithu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంటికివచ్చి స్నానముచేసి శుద్ధిని పొందితిని. అటుపిమ్మట విచారముతో విందారగించితిని. అప్పడు ఆమోసు ప్రవక్త బేతేలును గూర్చి

“నీ పండుగలు శోకదినములగును

నీ యానందగీతములు శోకగీతములగును.”

అని పల్కిన వాక్యము నాకు జ్ఞప్తికి వచ్చెను. నేనుదిగులుతో ఏడ్చితిని.

7. ప్రొద్దుక్రుంకిన తరువాత గోతిని ద్రవ్వి పీనుగును పాతిపెట్టితిని. 8. ఇరుగుపొరుగువారు నన్నుపరియాచకముజేసి "నీకు ఏ మాత్రము భయము లేదా? పూర్వము నీవిట్టి పనిని చేసినందులకు వారు నీ ప్రాణములు తీయగోరిరి కదా! నీవప్పడు పారిపోయి ప్రాణములు రక్షించుకొంటివి. అదరు బెదరు లేక ఇప్పడు మరల ప్రేతములను పాతిపెట్టుచున్నావా?" అనియనిరి.

9. ఆ రాత్రి నేను స్నానము చేసి శుద్ధిని పొంది మా యింటి ముంగిట గోడ ప్రక్కన పండుకొంటిని. వాతావరణము వేడిగానున్నందున మొగమును బట్టతో కప్పకోనైతిని. 10. ఆ గోడమీద పిచ్చుకలున్నవి. కాని ఆ సంగతి నాకు తెలియదు. అవి తమ వేడిరెట్టను చివాలున నా కన్నులలో జారవిడచెను. నేను వైద్యునితరువాత వైద్యుని సందర్శించితిని. కాని వారి లేపనమువలన నా కంటి పొరలు ఇంకను ముదిరినవి. చివరకు చూపు పూర్తిగా మందగించినది. నేను నాలుగేండ్లపాటు గ్రుడ్డివాడనుగా నుంటిని. అహీకారు ఏండేండ్ల వరకు నన్ను పోషించెను. తరువాత అతడు ఏలామునకు వెళ్లిపోయెను.

నా భార్య సామాన్య స్త్రీలవలె కూలిపని చేయవలసివచ్చెను. ఆమె మగ్గముమీద నేత నేసెడిది. 11. ఆ నేసిన బట్టను తీసికొనిపోయినపుడు యజమానులు ఆమెకు కూలి యిచ్చెడివారు. 12. ఒక పర్యాయము మూడవ నెల ఏడవ దినమున అన్నా ఒక బట్టను నేసి యజమానుల యొద్దకు కొనిపోయెను. వారామెకు పూర్తి వేతనమును చెల్లించుట మాత్రమేగాక ఒక మేకపిల్లను గూడ కానుకగా నిచ్చిరి. 13. అది మా యింటికి రాగానే

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Thobithu.pdf/7&oldid=237536" నుండి వెలికితీశారు