పుట:Thobithu.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

21. అటుతరువాత నలుబది దినములు గడువక ముందే సన్డెర్రీబు కుమారులిద్దరు తమ తండ్రిని హత్యచేసి అరారతు కొండలకు పారిపోయిరి. సనైరీబు తనయుడు ఏసర్షద్లోను తండ్రికి బదులుగా రాజయ్యెను. ఆ రాజు నా సోదరుడైన అనాయేలు కుమారుడు అహీకారును తన రాజ్యమున ఆర్థిక వ్యవహారములను పరిశీలించు అధికారినిగా నియమించెను. 22. అతడు సన్డెరీబునకు గూడ గృహనిర్వాహకుడు, కోశాధికారి, లేఖకుడు, ముద్రాధికారి. కనుక ఏసర్షద్లోనును గూడ అతనిని పూర్వపదవిలో కొనసాగనిచ్చెను. నా సోదరుని తనయుడగు ఈ యహీకారు నా తరపున రాజునకు మనవిచేయగా నన్ను తిరగి నీనెవెకు రానిచ్చిరి.


2. తోబీతు దృష్టిని గోల్స్లోవుట

2.1. ఆరీతిగా ఏసర్షద్లోను పరిపాలనా కాలమున నేను మరల యిల్లు జేరుకొంటిని. నా భార్య అన్నా నా కుమారుడు తోబియా కూడ నా యొద్దకు తిరిగివచ్చిరి. ఏబదినాళ్ళకు వచ్చువారముల పండుగునకు మేము మంచి విందు సిద్ధము చేసికొంటిమి. నేను భోజనము చేయనెంచితిని. 2. బల్లమీద చాల భోజన పదార్థములు కనుపించినవి. నేను నా కుమారుడు తోబియాతో, "నాయనా! నీవు బయటికి వెళ్లి మనవలె ఈ పట్టణమున ప్రవాసమున జీవించుచున్న పేద యిస్రాయేలీయునొకనిని తోడ్కొని రమ్మ కాని యతడు దేవుని పట్ల భయభక్తులు చూపవాడై యుండవలయును. అతనిని మనతో కలుపుకొని భుజింతము. నీవు వచ్చువరకును నేను వేచియుందును" అని చెప్పితిని. 3. తోబియా పేదవానిని వెదకి తీసికొని రాబోయెను. కాని యతడు కొంచెము సేపటిలోనే తిరిగి వచ్చి నాయనా! నాయనా! యని పిలచెను. నేను ఏమి జరిగినదని యడిగితిని. అతడు “మన జాతివాని నొకనిని ఇప్పడే గొంతుపిసికి చంపి సంతవీధిలో పడవేసిరి" అని చెప్పెను. 4. నేను భోజనమును ముట్టుకొనకుండ వెంటనే లేచి వెళ్లితిని. సంతనుండి శవమును తీసికొనవచ్చి ఒక పాకలో నుంచితిని. సాయంకాలమైన పిదప దానిని పాతిపెట్టావచ్చు ననుకొంటిని. 5-6. తరువాత

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Thobithu.pdf/6&oldid=237535" నుండి వెలికితీశారు