పుట:Thobithu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అరచుట మొదలుపెట్టెను. నేను నా భార్యను పిలిచి "ఈ మేకపిల్ల యొక్కడిది? నీవు దానినెవరి యెద్దనుండి చైున దొంగిలించుకొని వచ్చితివాయేమి? పోయి వెంటనే దానిని దాని యింటివారి కప్పగించిరమ్మ ്ഠ് సొమ్మను భుజించుట న్యాయముకాదు" అని యంటిని. 14. అన్నా "యిది దొంగ సౌమ్మకాదు. వేతనముతో పాటు దీనిని గూడ నాకు బహుమతిగా నిచ్చిరి" అని చెప్పెను. కాని నేనామె పలుకులు నమ్మనైతిని. ఆమె చేసిన పనికి నేను మొగమెత్తుకోజాలనైతిని. కనుక ఆ మేకకూనను దాని యజమానుల కిచ్చిరమ్మని పట్టుపట్టితిని. కాని ఆమె కోపముతో "నీ దానధర్మములన్నియు ఏమైనవి? నీ సత్కార్యములన్నియు ఏ గాలికి పోయినవి? ఆ పుణ్యమంతయు ఏ వరదన బోయినది? ఇప్పడు నీ హృదయము నాకర్థమైనదిలే" అని విరుచుకొనిపడెను.

3.1. ఆ మాటలకు నేను సంతాపముచెంది నిటూర్పు విడచితిని. ఏడ్చితిని. ఈ క్రింది శోకగీతమును జపించితిని.

2. "ప్రభూ! నీవు న్యాయవంతుడవు నీ కార్యములన్నియు న్యాయసమ్మతములైనవి నీవు నమ్మదగినవాడవుగా మెలగుదువు నీవు ఈ లోకమునకు న్యాయాధిపతివి.

3. నన్ను కరుణతో బ్రోవుము నా పాపములకు నన్ను శిక్షింపకుము తెలియక చేసిన తప్పిదములకు నన్ను దండింపకుము మా పితరుల పాపములకు నన్ను శిక్షింపకుము

6. నేను కన్ను మూయుటయే మేలు నేను పొందగూడని యవమానములు పొంది విచారమనస్కుడనైతిని ప్రభో! నీవు ఆజ్ఞ ఇచ్చిన చాలు

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Thobithu.pdf/8&oldid=237537" నుండి వెలికితీశారు