పుట:Thittla gnanam.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యోగికి బుద్ధితో పనిలేదు అనియు, బుద్ధిలేదు కావున యోచించడు అనియు పూర్వము పెద్దలు వివరించారు. యోగి అయినవాడు గుణములున్న వారివలె యోచించడు అని తెల్పుటకు, ఆ రోజులలో "నా చవితికి బుద్ధిలేదు" అనెడి వారు. అంతేకాక "నా చవితీ! నీకు బుద్ధి ఉందా" అని అడిగినట్లు మాట్లాడేవారు. ఆ విధముగా అనడము వలన ఎదుటి వానిని యోగిగ వర్ణించునట్లు అర్థమయ్యేది. అంతేకాక యోగి అయినవాడు తొందరగా మోక్షమును పొంది లేకుండ పోతాడు అను ఉద్దేశముతో, ఎదుటివాని యోగమునకు విలువనిస్తు "నా చవితీ నీవు తొందరగా నాశనమై పోతావు" అని అనెడి వారు. ఈ మాటలన్నియు పూర్వము మంచి జ్ఞాన ఉద్దేశమును కల్గియుండగా, అవే మాటలు అన్నియు నేడు తిట్ల జాబితాలోనికి చేరిపోయినవి.


ఒకమాట యొక్క అర్థము, దానివిలువ తెలిసి మాట్లాడితే అది జ్ఞానమవుతుంది. తెలియక మాట్లాడితే అజ్ఞానమవుతుంది. ఈ సూత్రము ప్రకారము 'నా చవితి' అను మాట తెలిసినవానికి జ్ఞానము, తెలియనివానికి అజ్ఞానముగా ఉన్నది. ఈ విషయము బాగా అర్థమగుటకు చిన్న ఉదాహరణను చెప్పుకొందాము. ఈ కాలములో బాగా కష్టాలలో కూరుకుపోయిన పుల్లయ్య అను వ్యక్తి నారాయణస్వామి దేవాలయమునకు పోయి, అక్కడ విశ్రాంతిగ కూర్చొని, తన మిత్రునితో ఈ విధముగా అంటున్నాడు.


పుల్లయ్య :- నేను పది సంవత్సరములనుండి క్రమము తప్పకుండ ఈ గుడికి వచ్చి నారాయణస్వామికి మ్రొక్కి పోతున్నాను. అయినా నాకు వరుసగా కష్టములు వస్తూనే ఉన్నాయి. చివరికి పూర్తి దరిద్రున్నయి పోయాను. నేను ఈయనను మ్రొక్కుట వలననే దరిద్రున్నయి పోయాను,