పుట:Thittla gnanam.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అను శబ్దముగా మారినది. తర్వాత పాడ్యమి అను శబ్దము మౌడ్యము అను శబ్దముగా మారిపోయినది. మౌడ్యము అనగా అజ్ఞానము అని అర్థము. పంచాంగములోని పదిహేను తిథులలో మొదటిది పాడ్యమి, చివరిది పౌర్ణమి. పాడ్యమి అజ్ఞానమునకు గుర్తు, పౌర్ణమి సంపూర్ణ జ్ఞానమునకు గుర్తు. తిథులలో పాడ్యమిగా ఉన్నదే మనుషులలో మౌడ్యముగా ఉన్నది.


గుణచక్రములోని లోపలి నాల్గవభాగములో జీవుడుంటే యోగి అవుతాడు. అటువంటి యోగిని పూర్వము జ్ఞానము తెలిసినవారు నాల్గవ వానిగా గుర్తించి చవితి అని సంబోధించి పిలిచెడివారు. మిగత మూడు గుణములలోని మనుషులు ఎవరైనా ఎదుటివాడిని గౌరవిస్తూ వాడు యోగి కాకున్ననూ, వానికి గౌరవ ప్రథముగా యోగియొక్క విలువనిచ్చి చవితి అనెడి వారు. ఈ విధముగా యోగులనుగానీ, యోగులతో సమానమైన వారిని గానీ, గౌరవముగా పలకరిస్తూ నా చవితీ బాగున్నావా అని అనెడివారు. తామసుడుగానీ, రాజసుడుగానీ, సాత్త్వికుడుగానీ మూడు రకములవారు యోగస్థానములోని వానిని చవితి అనుట ఆనాటి జ్ఞానపుమాట. ఈనాడు, ఆనాటి జ్ఞానము తెలియని దానివలన ఆ మాటను దూషణగా వినియోగిస్తున్నారు. అది ఈనాటి తిట్టుగా ఉండినా, వివరించు కొని చూస్తే అందులో జ్ఞానమున్నది. దానిని తిట్ల జ్ఞానముగా మనము చెప్పుకొంటున్నాము.


ఇంకా కొంత వివరముగా చెప్పుకొంటే నాల్గవస్థానమైన ఆత్మ స్థానములో ఉన్నవానికి అక్కడ గుణములు లేవు. కావున వాని బుద్ధి యోచించవలసిన పనిలేదు. గుణములున్నపుడే బుద్ధికి పని ఉండును. గుణములు లేనపుడు బుద్ధికి ఏమాత్రము పని ఉండదు. అందువలన