పుట:Thittla gnanam.pdf/34

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కాబట్టి నేను దినము మ్రొక్కే దేవుడు దరిద్రపు నారాయణ అని తెలిసిపోయింది.

మిత్రుడు :- నీకు దరిద్రము వస్తే నారాయణస్వామి కూడ దరిద్ర నారాయణగా కనిపించాడా?

పుల్లయ్య :- లేకపోతే ఏ మని చెప్పాలి? ఇప్పుడు నేను చెప్పేమాటే కాదు. పూర్వము నేను చిన్నప్పుడు కొందరు దరిద్రపు నారాయణ అని కష్టాలు వచ్చిన వానిని అనేవారు. ఆ సామెత నాకు నిజమైనది. అందువలన నేను మ్రొక్కే నారాయణను దరిద్రపు నారాయణ అన్నాను.

మిత్రుడు :- అలా అనడము మంచిది కాదేమో! మనము దరిద్రులమైతే నారాయణను దరిద్రము అనడము మంచిది కాదు కదా!

పుల్లయ్య :- అలా అనక ఏమనాలి? నేను ఇంతకాలము మ్రొక్కినా ఏమీ ప్రయోజనము లేదు. దేవుని దగ్గర నీతిలేదు, న్యాయములేదు. ఆయనకు కొంచెమైనా దయ కూడ లేదు, నాకు తెలిసింది అంతే. ఈ విధముగ మాట్లాడిన ఇద్దరి మిత్రుల మాటలను రామయ్య, ఈరయ్య అను మరొక ఇద్దరు మిత్రులు విన్నారు. ఆ మాటనువిన్న రామయ్య, ఈరయ్య ఈ విధముగా మాట్లాడుకొనుచున్నారు.

రామయ్య :- పుల్లయ్య మాట్లాడములో తప్పేముంది? ఆయనకు కష్టాలు ఎక్కువైనాయి, కాబట్టి దేవుని దగ్గర నీతి, న్యాయములేదు, కొంచెమైనా దయలేదు అన్నాడు. ఎక్కువ కష్టాలు వస్తే ఇంతకాలము మ్రొక్కిన దేవుని మీద కోపము రాక ఎవరిమీద వస్తుంది.

ఈరయ్య :- పుల్లయ్యకు కోపమువచ్చి దేవున్ని "దరిద్రపు నారాయణ"