పుట:Thittla gnanam.pdf/3

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వ్యక్తులకు చేతులతో నమస్కరించడము, అసాధారణ వ్యక్తులైన స్వామీజీలకు గురువులకు పాదాభివందనము చేయడము హిందువులలో పరిపాటైనది. ఈ విధానము పూర్వకాలమునుండి వస్తున్న విషయమే. ఈ విధానకార్యము పూర్వముదే అయినప్పటికి కార్యములోని భావము తల్లక్రిందులై పోయినదని చెప్పవచ్చును. ఎన్నో ఆచరణలకు అర్థము తెలియకుండ కాలగర్భములో కలిసిపోయినట్లే పెద్దలను గౌరవించడములోను, వారు దీవించడములోను అర్థము మారిపోయినదనియే చెప్పవచ్చును.


ఒక మనిషి ఒక స్వామికిగాని గురువుకుగాని పాదాభివందనము చేసినపుడు నమస్కరించిన మనిషికి మేలు చేయునిమిత్తము చెప్పబడు మాటను ఆ స్వామీజీ ఇచ్చిన దీవెన అంటాము. అదే విధముగ చెడు చేయునిమిత్తము చెప్పబడు మాటలను తిట్లు అంటాము. చెడు జరుగు దూషణలుగాని, మంచిజరుగు దీవెనలనుగాని శాపములు అంటాము. శాపము అన్నపదము శాసనము అను పదమునుండి పుట్టినది. శాసనము అనగ తప్పనిసరిగ జరిగి తీరునదని అర్థము. అలాగే శాపము అనగ తప్పని సరిగ జరుగునని అర్థము. చెప్పెడి వ్యక్తి గొప్పవాడైతే ఆ మాట తప్పనిసరిగ జరిగితీరుతుంది. చెడు దూషణ విషయములలోనే శాప ముండును కదా! మంచి దీవెన విషయములలో కూడ శాపముండునా! అని కొందరికి అనుమానము రావచ్చును. దానికి సమాధానము ఏమనగా! మంచిగాని చెడుగాని తప్పనిసరిగ జరుగుదానినే శాపమంటాము గాని ఒక చెడు జరుగు విషయమునకే శాపమును అంటగట్టకూడదు.


కర్మను తల్లక్రిందులు చేయగల శక్తి బ్రహ్మర్షిహోదాలోనున్న ఒకే ఒక గురువుకు మాత్రముండును. అటువంటి గురువు యొక్క సంకల్పము మంచిదైతే దీవెనగాను, చెడుదైతే కీడుగాను మారగలదు. బ్రహ్మర్షి హోదాగల