పుట:Thittla gnanam.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జరుగునని తెలిసి అతనిని ఆశ్రయించవచ్చును. అలాగే ఒక కోర్కె నెరవేరుటకు దేవున్ని ఆశ్రయించడములో మనిషి పొరబడుచున్నాడు. ఎందుకనగా! ప్రపంచమునకంతటికి ఒకే దేవుడుండగ ఆయనను గుర్తించడములో పొరబడి దేవుని స్థానములో చాలామందిని దేవతలుగ మనిషి భావించుకొన్నాడు. ఒక పని నిమిత్తము ఆ పని ఎవరి చేతనవుతుందో తెలిసి మనుషులను ఆశ్రయించిన మనిషి, అలాగే ఒక కోర్కె ఎవరి వలన నెరవేరుతుందో తెలియక చాలామంది దేవతలను ఆశ్రయించుచున్నాడు. అందువలన మనిషికి చాలామంది దేవతలు అవసరమైపోయారు. తన అవసరనిమిత్తము క్రొత్తక్రొత్త దేవతలను మనిషి సృష్ఠించుకొంటు పోవుచునే ఉన్నాడు. అన్నిటికి ఆదికర్తయైన పరమాత్మయను దేవున్ని వదలి అనేక దేవుళ్ళను భజించడము పూజించడము అజ్ఞానమే అనడము ఇప్పుడు సందర్భము కాదు. ప్రస్తుతమున్న విషయముమే ఇక్కడ చర్చనీయాంశము, కావున మనిషి ఆశను మరియు కోర్కెలను మాత్రము వివరించుకొందాము.


ఒక మనిషి తన కోర్కెనిమిత్తము మరొక మనిషిని ఆశ్రయించడము చూస్తునే ఉన్నాము. అలాగే మనిషి అనేక విధములైన దేవతలను ఆశ్రయించడము కూడ చూస్తున్నాము. దేవతలను ఆశ్రయించి ఆరాధించు మనిషికి ఆ దేవుడు ఏమిస్తున్నాడో, ఏమి చేస్తున్నాడో కనిపించని విషయము. దానిని గురించి మేము ఏమి చెప్పిన నమ్మని పరిస్థితే మిగులుతుంది. కావున దేవతల విషయము వదలి కేవలము మనుషుల విషయమును మాత్రము వివరించదలచుకొన్నాము.


ఒక మనిషి తనకు నమ్మకమున్న వ్యక్తిని ఆశ్రయించినపుడు అతనిని గౌరవభావముతో చూడడము సహజము. గౌరవ నిమిత్తము నమస్కరించడము పాదాభివందనము చేయడము జరుగుచున్నది. సాధారణ