పుట:Thimmarusumantri.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థ ప్రకరణము

57


విజయమును శ్రేయస్సును గలుగుటమాత్రమే గాక సామ్రాజ్యముయొక్క ప్రతిష్ఠ లోకమున వ్యాపింపఁ గలదు. చిన్నపామునైనఁ బెద్దకఱ్ఱతోఁ గొట్టవలయునన్న సామెతరీతిగాఁ గప్పములు చెల్లింపక ప్రతిఘటించిన చిన్న పాలెగాండ్రను సయితము గొప్పసైన్యములతో, బోయి రూపు మాపవలయును. మనకుఁ గప్పములు చెల్లింపక ప్రతిఘటించుచున్న వారు కొందఱు సామ్రాజ్యములోపల నున్నవారని యీమహానగరమునఁ దెలియకపూర్వమె వారల నడంచుఁ బ్రయత్నములను జేసి విజయమును గాంచుట శ్రేయస్కరము. వజ్రసింహాసన రక్షణకొఱకును, రాజ్యపరిపాలనానిర్వహణము కొఱకును నేను రాజధానియందు నిలిచియుండెదను. మైసూరు దేశమునందలి పాలెగాండ్రను జయించి కప్పములు గొనుటకు మీ తమ్ముఁడు కృష్ణరాయఁడు సమర్ధుఁడు. అతఁడు విశ్వాసపాత్రుఁడు. నీకు విధేయుఁడైన తమ్ముఁడుగాని యన్యుఁడుగాఁడు. మీరు తీర్థయాత్రపేరు చెప్పి బహుళ సైన్యముతోఁ బోయి సామ్రాజ్యము నంతయును తిరిగి కప్పములను గొని రావలయును. కప్పములను జెల్లింపక తిరస్కరించెడివారుందురేని వారలను బదభ్రష్టులను గావించి వారిస్థానములఁ గ్రొత్తవారిని నియమించి కప్పములను గ్రహింపవలయును. అట్లుగాక యుద్ధము జరుపవలసి వచ్చెనేని సంశయింపక శత్రువుల రూపుమాపుటకుఁ గడంగ వలయును. ఒకప్పుడు మీతోడనున్న సైన్యము చాలదని తోఁచెనేని నాకు వర్తమానము చేసినయెడల వెంటనే సైన్య