పుట:Thimmarusumantri.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

తిమ్మరుసు మంత్రి


మును సమకూర్చి పంపెదను. అవశ్యము మీర లీమహాకార్యమును నిర్వహించి దిగ్విజయమును జేయవలయును.”

ఇట్లు ప్రబోధించిన మంత్రివర్యుని ప్రబోధమునకు వికాసమును జెంది వీరనరసింహరాయఁడు తిమ్మరుసుతో నిట్లనియెను.

"అమాత్యవర్యా! మాతండ్రి పరలోకగతుఁ డగునపుడు మమ్ములను మా సామ్రాజ్యమును నీకప్పగించి మా సంరక్షణభారము నీయది యని చెప్పెను. అర్దానర్థవిదుండవు ; అఘటనాఘటన చాతుర్య ధురీణుండవు ; సకలకార్య సమర్థుండవు ; మహారాజ్యతంత్రజ్ఞుండవు ; నీవు మాకు విశ్వాసపాత్రుఁడవుగాక యన్యుఁడవే ? నీ వేదిపనిచిన దానిఁ జేయుటకు నేనెప్పుడును వెనుదీయువాఁడను గాను. నీచే శిక్షితుఁడైన మా తమ్ముఁడు కృష్ణరాయఁడును మాకు విశ్వాసపాత్రుఁడే. అందులకు నీ వెంతమాత్రమును సందేహింపవలదు. ఇదే నేను దిగ్విజయయాత్ర వెడలి కప్పములు చెల్లింపక ప్రతిఘటించిన పాలెగాండ్రను శిక్షించి కప్పములు కైకొని తీర్థయాత్రలు సేవించి శీఘ్రకాలములోనే వచ్చెదను. ఈరాజధానిని, వజ్ర సింహాసనమును నీవకాపాడు చుండుము.”

అని చెప్పి యొకనాఁడు శుభముహూర్తమున బహుళ సైన్యసమేతుఁడై తీర్థయాత్రను సాటించి దిగ్విజయయాత్రకై బయలు వెడలెను.

తిమ్మరుసుమంత్రియుఁ గృష్ణరాయనిఁ బిలువ నంపించి “వీరాగ్రణీ! కర్ణాటదేశమునందలి రాజులును, పాలెగాండ్రును