పుట:Thimmarusumantri.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

తిమ్మరుసు మంత్రి


మున రాజద్రోహులను దలయెత్తకుండఁజేసి విశేషసామర్థ్యముతో నగరమును సంరక్షింపు చుండెను. వీరనరసింహరాయని పిన్నతమ్ములగు నచ్యుతరాయలను శ్రీరంగరాయలను గొంత సైన్యము నొసంగి కొంకణదేశమునకును, కర్ణాటదేశములోని తలకాడు, ఉమ్మత్తూరు మొదలగు ప్రదేశములకును గప్పములను రాఁబట్టుటకై పంపెను. వారలు కొంకణదేశపు నాయకులను జయించి వారలవలనఁ గప్పములనుగొని తలకాడునకుఁ బోఁగా నచటి పాలెగాండ్రు గప్పములను జెల్లింపక తిరస్కరించుటయే గాక వారల యుద్ధమున నోడించి తఱిమిరి. అప్పుడు తిమ్మరుసు వీరనరసింహరాయని సన్నిధానమున కేగి యిట్లనియె.

“రాజేంద్రా! ఇదివఱకు మీతండ్రికిఁ గప్పము గట్టుచున్న కొందఱు సామంతులును పాలెగాండ్రును మీరు పిన్నవారని యుద్ధతులై గప్పములు గట్టక స్వతంత్రులై మీ యధికారమును దొలఁగఁజేయవలయనని ప్రతిఘటించుచున్నారు. ఉమ్మత్తూరు శివసముద్రము పాలెగాండ్రపైకి బంపిన సైన్యము వారలతోఁబోరాడి జయింపలేక మరలివచ్చినది. ఇట్టి సందిగ్ధ సమయమున మనముపేక్షించితిమేని సామ్రాజ్యమునకుఁ జేటువాటిల్లును. మీకుటుంబమునెడ నాకుఁ గల భక్తివిశ్వాసములు మీర లెఱుంగనివికావు. మీతండ్రి నాయెడఁగల యనురాగమును విశ్వాసమును మీర లెరుంగనవికావు. మీరును నన్ను విశ్వాసపాత్రునిగాఁ దలంచినయెడల నేనొక్క యాలోచనమును జెప్పెదను. నేను చెప్పినట్లు మీరు చేసెదరేని దాన మీకు