పుట:Thimmarusumantri.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

తిమ్మరుసు మంత్రి


మును వెంటబెట్టుకొని బోయి తుంగభద్రానదిని దాటి యసహాయశూరుఁడై తురుష్క సైన్యముల నెదిరించి దోర్దర్పమును జూపి కొంతతడవు పోరాడఁ గలిగి దురుష్కసైన్యమును గొంతవఱకు నాశము గావించెను. గాని సుల్తానా యవమానమును భరింపజాలక సేనలం బురికొల్పుకొని స్థిరచిత్తుడై రణరంగమున నిలిచి సమరము సలుప తిమ్మనాయకుఁడు శత్రుసైన్య మధిక మగుటఁ గాంచి పోరాడఁ జాలక తన సైన్యములను మరిలించుకొని రాజధానికి వచ్చెను. ఆదిల్‌షాహ విజయనగరరాజధానిపై దండెత్తి రాఁగలసమర్ధుఁడు గాకుండుటచే నంతటితోఁ దృప్తినొంది ముదిగల్లు రాచూరుదుర్గములను గైకొనియెను. తిమ్మరుసు సామ్రాజ్యమున రాజ్యాంగ