పుట:Thimmarusumantri.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయ ప్రకరణము

33


దున నాదళవాయి విచారించుచు, తుళువ నరసరాయని మఱింత ద్వేషించుచు నపకారము సలుప నిశ్చయుఁడై ఇమ్మడి నరసింహరాయని ప్రేమను క్రమముగా సంపాదించి యాతనిఁ దన కనుకూలుని గావించుకొని తుళువ నరసరాయని, తిమ్మరుసును, సాగనంపుటకై ప్రయత్నించు చుండెను. తిమ్మరుసు మంత్రి చారులవలన వాని దుర్మార్గమును దెలిసికొని సరసరాయనితో నిట్లనియె." వీరాగ్రణీ! వీఁడు మనకు శత్రువై బాలుఁడైన మహారాజు నాకర్షించి యాతనితోఁ జెలిమి గావించుకొని మన వినాశనమునకై ప్రయత్నించుచున్నాఁడు. భ్రాతృహంతకుఁడైన వీనిని జేరఁదీసి యిమ్మడి సరసింహరాయఁడు గౌరవించు చున్నాఁడు. దీన నేమి యుపద్రవము కలుగునో యీబాలరాజు గుర్తెఱుఁగక యున్నాడు. నిష్కారణముగా దనయన్నను జంపించినవాఁడు తన్నుఁ జంపింపక మాసునా ! ఇతని దౌర్భాగ్య మేమని చెప్పవచ్చును? మన ముపేక్షించి యున్న పక్షమున సామ్రాజ్యమునకు ముప్పు వాటిల్లును. ఈద్రోహియైన దళవాయిని బలిమినైన మాయోపాయమునైనఁ గడతేర్చినఁగాని నీకును, నాకును, సామ్రాజ్యమునకును క్షేమము లేదు. కావున ముందుగా నేను బాలరాజును మందలించి హితబోధ గావించి చూచెదను. అతఁడు వినకున్న జరుపఁదగిన కార్యమునుగూర్చి తరువాత యోజింత' మని చెప్పి యాతని సమ్మతిగైకొని తిమ్మరుసుమంత్రి యొకనాఁడు మహారాజు సన్నిధానమునకు బోయి యిట్లు హితబోధ గావించెను.