పుట:Thimmarusumantri.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయ ప్రకరణము.

ఇమ్మిడి నరసింహయఁడు.

సాళ్వనరసింహరాయఁడు స్వర్గస్థుఁడైనవెనుక నతని పెద్దకుమారుని, బాలుని తిమ్మరాయనిఁ బట్టాభిషిక్తుని గావించి తుళువనరసరాజు సమస్థ రాజ్యభారధురంధరుఁడై తిమ్మరుసు మంత్రి సాహాయ్యంబున బరిపాలనము సేయుచుండెను. సరసింహసామ్రాజ్యమున నిట్టి మౌద్ధత్వమును బొంది నరసరాయఁడు తానే రాజ్యచక్రమును నడిపించుటఁ జూచి సహింప జాలక యొకదళవాయి నరసరాయనిపై నొకయపవాదు గల్పింపనెంచి రహస్యముగా బాలరాజును జంపించెను. తుళువ నరసరాజే రాజద్రోహియై రాజ్యాపహరణ నిమిత్తము బాలరాజును చంపించెనని ప్రజలు చెప్పుకొనుచు నరసరాజును ద్వేషించునట్లుగాఁ జేసినవాని కపటతంత్రమునకుఁ బ్రతిహతి నాలోచింపు మని తిమ్మరుసును వేడెను. “ప్రభువర్యా! శత్రువును సాధించుపని తరువాత చూచుకొందము. ముందుగా సాళ్వనరసింహభూపాలుని ద్వితీయపుత్త్రుని ఇమ్మడి నరసింహరాయఁ డనుపేరుతోఁ బట్టాభిషిక్తునిగావించి యపనిందఁ బాపికొను” మని తిమ్మరుసుమంత్రి ప్రబోధింపఁగా నతఁ డట్లు గావించి యపనిందఁ బోగొట్టుకొని జనరంజకుఁ డయ్యెను. తన ప్రయత్నమంతయు నీకార్యముమూలముగా విఫలమైనం