పుట:Thimmarusumantri.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

తిమ్మరుసు మంత్రి


లధికముగా నభివృద్ధి యగుచున్నవి. ఈదేశములు మహమ్మదీయాక్రాంతములై వారలచేఁ బరిపాలింపఁబడు చుండుటచేత వారలకు నశ్వపతులనుబిరుదు వచ్చినది. పదాతిసైన్యము మన కెక్కువగా నుండుటచేత మనకు నరపతు లనుబిరుదము వచ్చినది. అశ్వపతులను జయించుటకు మన కాశ్వికసైన్యము మెండుగా నుండవలయును. గజపతులను జయించుటకు గజ సైన్యము మెండుగా నుండవలయును. బహమనీసుల్తానుకన్న మీర లైశ్వర్యవంతులు. బహమనీసుల్తానుకన్న మన మధికమైన వెల యిచ్చినపక్షమున మనకే విక్రయింతురు. పోర్చుగీసు వర్తకులమూలమున మన మీకార్యమును నిర్వహించుకొనవచ్చును. అశ్వికసైన్యమును మనము బలపఱచుకొనుపర్యంతము బహమనీసుల్తానుపై దండయాత్ర సలుపరాదు. అతఁడు దండెత్తివచ్చిన మనము నిలిచి పోరాడవచ్చును. కాని మనము మాత్రము దండెత్తిపోరాదు. అశ్వబలమును సమకూర్చుకొని యశ్వపతులను జయించిన పిమ్మట గజపతులను జయింపవలయును. అంతపర్యంతము మన మోపికవహించి యశ్వబలమును గజబలమునుగూడ పెంపుచేసికొనుచుండుట శ్రేయమని నాయభిప్రాయము. అశ్వములను సంపాదించుటకై ధనమును గుప్పింపవలయును.”

తిమ్మరుసుచే నిట్లు ప్రేరేపింపఁబడి నరసింహమహా రాజేంద్రుఁడు అరబ్బీదేశమునుండియు, పారశీకదేశమునుండియు నుత్తమాశ్వములను బెక్కింటిని దెప్పించుటకై బ్రతికినవైనను