పుట:Thimmarusumantri.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ ప్రకరణము

29


లను గజపతులను గూడఁ గృష్ణకు దిగువభాగమున నుండకుండఁ బాఱద్రోల వలయునని దృఢసంకల్పము గలదు. నేనీ శత్రువులనుఁ బాఱద్రోలునంతవఱకు నాకు నిద్రాహారముల యం దభిరుచి జనింపదు. దీని జయప్రదముగా నిర్వహించు మార్గము నెద్దియైనఁ జూపుము.”

తిమ్మరుసు హితబోధ

అందులకుఁ దిమ్మరు సిట్లు ప్రత్యుత్తర మిచ్చెను. రాజేంద్రా ! అశ్వపతులు గజపతులు మనకు శత్రువులుగ నున్నమాట సత్యము. వారలను జయించుట కష్టసాధ్యము. అశ్వపతుల కాశ్వికసైన్యము మెండుగాఁగలదు. పూర్వకాలమున సైన్యము, రథములు, గజములు అశ్వపతులు, పదాతులను నాలుగుభాగములుగానుండి 'చతురంగ ' మను సంజ్ఞ కలిగి యుండెను. ఆకాలమునందు రథబలమె శ్రేష్ఠ మైనదిగా నెంచబడియె. రథికులకు, అతిరథుఁడు, మహారథుఁడు, సమరథుఁడు, అర్థరధుఁడు ననుబిరుదము లుండెను. రథబలమింతకుఁ బూర్వమె సేనాంగములో నశించి తక్కినవి మూడుమాత్రమె నిలిచి యున్నవి. కళింగదేశమునం దరణ్యములు మెండుగా నుండుటచేతను నాయరణ్యములలో గజములు విస్తారముగా నుండుటచేతను కళింగదేశాధిపతులకు గజబల మధికముగా నుండుచు వచ్చెను. అందువలన వారలకు గజపతు లనుబిరుదు నామము గలిగినది, అరబ్బీపారశీక సింధుదేశములందు గుఱ్ఱము