పుట:Thimmarusumantri.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ ప్రకరణము

27


వారే యానగరరాజమున నధికసంఖ్య గలవారుండిరి. సాళువనరసింహభూపతి బలాడ్యుఁడుఁ సమర్ధుఁడు, యోగ్యుఁడు నై నందున సామంతనృపవర్గ మాతనిపట్టాభిషేక మహోత్సవమున కామోదించుచుఁ గానుక లంపించిరి, మఱికొందఱు నామహోత్సవమును గన్నులార వీక్షించుటకై తామే యరుదెంచిరి. ఒకశుభమహూర్తమున సాళ్వనరసింహభూపతి కర్ణాటసామ్రాజ్య పట్టాభిషిక్తుఁడై మహారాజాధిరాజ, రాజ పరమేశ్వరేత్యాది బిరుదాంచితుఁడై వఱలెను. అంతటనుండి కర్ణాటసామ్రాజ్యము నరసింహసామ్రాజ్య మని దిగంతములవఱకు బేరుమ్రోసెను. కర్ణాటసామ్రాజ్యము బలపడియెను. సామంతనృపవర్గము నరసింహసార్వభౌముఁ డన్న భయభక్తులతో నుండెను. దండనాధు. రెల్లరును వినయవిధేయులై యుండిరి. ఇట్లు సాళ్వనరసింహభూపతి శకసంవత్సరము 1408-లో (1486–87) కర్ణాటసామ్రాజ్యసార్వభౌముఁ డయ్యెను. ఈతని పరిపాలనతో విద్యానగరమునఁ దెలుఁగువారికిఁ బలుకుఁబడి యెక్కువ యయ్యెను. కర్ణాటసామ్రాజ్యము సంపూర్ణముగా నాంధ్రుల స్వాధీన మయ్యె నని చెప్పవచ్చును. తిమ్మరుసుమంత్రి తన ప్రజ్ఞను వికసింపఁజేయుకాలము తటస్థించెను. ఇట్లు మనోరథసిద్ధిఁ బడయు నదృష్టముఁ గాంచిన తిమ్మరుసుమంత్రిని సాళ్వనరసింహసార్వభౌముడుఁ విడిచిపెట్టి యుండలేదు. అతని ననేక విధముల సత్కరించెను. అతనితో యోజింపక యేకార్యమును