పుట:Thimmarusumantri.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

తిమ్మరుసు మంత్రి


లేక యుండెను. రాజబంధువులను విద్యానగరమున నుండనీయక నరసారాయఁడు కొందఱను పెనుగొండకును, కొందఱను గుత్తికిని, కొందఱను జంద్రగిరికిని బంపించెను. అంతః పురములోని నౌకరులను దొలఁగించి వారెస్థానమునఁ గ్రొత్తవారిని నియమించెను.

సాళ్వనరసింహుని పట్టాభిషేకము

తిమ్మరుసుమంత్రి సాళ్వగుండయనారసింహుని పట్టాభిషేకమహోత్సవాహ్వాన పత్రికలను రాష్ట్రములోని సామంత నృపతులకు దండనాధులకుఁ బంపించెను. సాళువ నరసింహ భూపాలుఁడు నరసారాయనికడ నుండి వచ్చిన సందేశమును విని తనవారివిజయమున కానందించుచు నెంతమాత్రమును జాగుసేయక పురోహితులను, మంత్రులను, సేనాపతులను, సామంతులను, రాణులను, పుత్త్రులను, పరివారజనంబులను వెంటఁగొని యొకశుభముహూ ర్తమున నారాయణవనమునుండి బయలుదేఱి కొన్నిదినములకు విద్యానగరమునకు వచ్చెను. తన సైన్యాధ్యక్షుడును, వాని మంత్రియగు తిమ్మరుసును పౌరజనులతో నెదురుగావచ్చి నగరమునకుఁ గొంపోయి రాజభవనమునం బ్రవేశపెట్టిరి. ఈసాళ్వనరసింహభూపాలుఁడు విద్యానగర నివాసులకుఁ గ్రొత్తవాడుకాఁడు. సాళ్వనరసింహుఁడు విద్యానగరమునఁ బేరు మోసినవాఁడే. కావున నితని బ్రేమించు