పుట:Thimmarusumantri.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152

తిమ్మరుసు మంత్రి


పుచుండగా 1526.27 సంవత్సరములో అనఁగా శా.శ. 1448 సరియగు వ్యయనామ సంవత్సర వైశాఖశుద్ధ పూర్ణిమనాఁడు విజయనగరమున వజ్రసింహాసనారూఢులయిన మహారాజాధిరాజ రాజపరమేశ్వర బిరుదాంచితులై ఆరవీటి రామరాయలచే నమలనేని కుమార పెదబుచ్చినాయనిం గారొక కౌలుపొందినట్టొక శాసనములోఁ దెలుపఁబడినది. ఈశాసనమునఁ బేర్కొనఁబడిన రామరాయలే అళియరామరాయలు. ఇతఁడు కృష్ణరాయని యల్లుఁడనుట స్పష్టము. ఈశాసనమునుబట్టి 1526 - 27 సంవత్సరములనుండి అళియరామరాయలు రాజధానీనగరమగు విజయనగరమునుండి సామ్రాజ్య పరిపాలనము చేయుచుండెననుట స్పష్టము. ఇంతియగాక మహమ్మదీయ చరిత్రకారు లై కకంఠ్యముగా కృష్ణదేవరాయల మరణానంతరము శిశువుగా నున్నవాని కుమారుని పట్టాభిషిక్తుని గావించి ఆళియరామరాయలే సామ్రాజ్యపరిపాలనమునకుఁ బూనుకొనియెనని వ్రాసియుండిరి. కాని అచ్యుతదేవరాయల ప్రశంస చేసినవారుకారు. ఇట్లు విజయనగర సామ్రాజ్యమును వశముఁ జేసికొనుటకై రెండు పక్షము లేర్పడినవి. అచ్యుతదేవరాయల బావమఱదులయిన సలకము పెదతిమ్మరాజును, సలకము చినతిమ్మరాజును, మహాపరాక్రమవంతుఁడయిన సాళువ వీరనరసింగరాయనాయకుఁడును మఱికొందఱు మండలాధిపతులును అచ్యుతరాయల పక్షమునను, అళియరామరాయలును వానిసోదరులు తిరుమలదేవరాయలును, కృష్ణదేవరాయల రాణు