పుట:Thimmarusumantri.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(21)

దశమప్రకరణము

143


“విద్యనేర్చి, యధర్మమువలని వెఱపుతోడను, రాజనీతివిధానముయొక్క ఎఱుకకలిమితోను గూడియుండి, ఏఁబదింటికి పైఁబడి డెబ్బదింటికి లోఁబడిన వయస్సుగలవాఁడై , ఆరోగ్యవంతులయిన పూర్వులుగలవాఁడై , అహంకారమును బోవిడిచి, రాజుయొక్క ప్రార్థనముమీఁద మంత్రిపదమును గై కొని, రాచకార్యములు నెఱవేర్చెడి బ్రాహ్మణులు దొరికినయెడ రాజ్యంగము లెంతయు బలపడునట్టి వగుటకు నొక్కపూట చాలదా" అను నర్థమిచ్చునట్టి పద్యమును జెప్పినది తిమ్మరుసువంటి ప్రతిభావంతుఁడైన బ్రాహ్మణమంత్రి విగ్రహమును వీక్షింపుచుఁ జెప్పిన పద్యమె యని బాలుఁడు సయితము గ్రహింపఁగలఁడు. శుక్రనీతి, చాణక్యనీతి, కామందకనీతి మొదలగువానిలోఁ జెప్పఁబడిన రాజనీతినిబట్టి యేబదింటికి బుద్ధి చక్కగాఁ బరిపాకముఁజెంది డెబ్బదింటివఱకుఁ బటిమగలిగి యుండునని గ్రహింపఁ గలిగిన కృష్ణదేవరాయలు తిమ్మరుసునెడ నిట్టి నిందారోపణ కెట్లొడిగట్టవలసివచ్చెనా యని యొకింత సంశయము కలుగ వచ్చును. ఈ “సన్నీజు" అను పోర్చుగీసుదేశస్థుఁడు చెప్పిన కథనము యధార్ధమును దెలుపున దగు నేని నిట్లు జరిగి యుండవచ్చును.

ఇంతకుఁ బూర్వము తన యన్నగారగు వీరనరసింహరాయలు తన యవసానకాలమునఁ దన కుమారునికే రాజ్యమును జెందింపఁ జేయవలయునన్న తలంపుతోఁ గృష్ణరాయనిఁ జంపి వాని నేత్రములను గొనితెచ్చి చూపవలసినదని తన