పుట:Thimmarusumantri.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

తిమ్మరుసు మంత్రి


అచ్యుతదేవరాయలును, రంగరాయలును, సోదరపుత్త్రుఁడయిన నరసింహరాయలును. కృష్ణరాయలు సింహాసనమెక్కినప్పుడు వీరలు మూవురును జంద్రగిరిదుర్గమునందు చెఱనుంచఁబడి యుండిరి. వారి పక్షమును బూని తిమ్మరుసు, రాజ్యమును కృష్ణరాయని యనంతరము వాని సోదరుడైన అచ్యుతదేవరాయనికిఁ జెందింపఁ జేయవలయుని తలంచి యుండినఁగదా రాయని పుత్త్రునిఁ జంపించుట ! సామ్రాజ్యములో సర్వాధికారములను వహించియున్న తిమ్మరుసేమి భాగ్యమును మూటకట్టుకోవలయునని తన చెప్పుచేతలఁ బ్రవర్తించుచున్న విశ్వాసపాత్రుఁడగు కృష్ణరాయని కాదని ఖైదులో నున్నవాని పక్షమును బూని చక్రవర్తి కమారునకు విషముపెట్టించి చంపించునంతటి దుష్టకృత్యమునకుఁ గడంగి తన ప్రాణముమీదికీ నాపదలు దెచ్చికొన సాహసించును? ప్రతిభావంతుఁడై యొక మహాసామ్రాజ్యమును జనరంజకముగాఁ బరిపాలించుచున్న తిమ్మరుసువంటివానిని బుద్దిహీనుఁడని తలంప నవకాశము గలదా ? లేదు. ఇతఁడు తన యాముక్తమాల్యదలోని నాలుగవ యాశ్వానములో యామునప్రభు రాజనీతిఘట్టములో :-

"చ. చదివి యధర్మభీతి నృపశాస్త్రవిధిజ్ఞతల న్వయస్సు డె
    బ్బదిటికిలోను నేఁబదికి బాహ్యమునై యరుజస్వపూర్వులై
    మదమఱి రాజు ప్రార్ధన నమాత్యతగైకొని తీర్చిపారువా
    రొదవిననంగముల్మిగుల నూర్జితమౌటకుఁ బూటపాలదే. "