పుట:Thimmarusumantri.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

తిమ్మరుసు మంత్రి


బుద్ధిగలవాఁడై బాలుఁడైన తనకుమారునికి దాను బ్రదికియుండఁగానే పట్టముగట్టి, వానిపేరిట దానే పరిపాలనము చేయవలయునని యూహించెను. ఆబాలునిపేరు తిరుమలరాయలట! కృష్ణరాయనికి మువ్వురో నల్వురో దేవేరులు గలరు. ఈతిరుమలరాయలు వారిలో నేదేవికి జనియించెనో తెలియదు. కృష్ణరాయనికి బుత్రికాసంతానమెగాని పుత్ర సంతానమున్నట్లు ఆంధ్రవాఙ్మయమునఁగాని మఱియేవాఙ్మయమునఁగాని గానరాదు. తుదకీబాలుని 1524 వ సంవత్సరములో సింహాసన మెక్కించి తాను ప్రధానామాత్యుఁడై కార్యనిర్వాహకర్తగ తిమ్మరుసు నేర్పరచి పరిపాలనము చేయనారంభించెనఁట ! తిమ్మరుసు కుమారుఁడు గోవిందరాజునకు సేనాధిపత్య మొసంగెనఁట ! ఎనిమిది మాసములు సామ్రాజ్యమునం దంతటను మహోత్సవములు సలుపఁబడెనఁట! తానొకటి తలంచిన దైవము వేఱొకటి తలంచెను. ఆకస్మికముగా నొక్క నాఁడేదో జాడ్యమంకురించి యాబాలరాజు మృతినొందుట సంభవించెనఁట ! ఇంకేమున్నది? రాయనికి పర్వతము బ్రద్దలై తలపైఁ బడినట్లు తోఁచెను. అతఁడు దురంతసంతాపముచే దురపిల్లుచుండగా తిమ్మరుసుకొడుకు తనకుమారునికి విషము పెట్టించి చంపించెనన్న దుర్వార్తయొక్కటి రాయనిచెవినిఁ బడియెనట ! అతఁడాదుర్వార్త నిశ్చయమనినమ్మి క్రోధావేశ పరవశుఁడై తిమ్మరుసు తనకుఁజేసిన యుపకృతులనన్నిటిని మఱచిపోయి యాతని, దళవాయియైన యతనిపుత్రుని గోవింద