పుట:Thimmarusumantri.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశమప్రకరణము

139


రాజును, నగరాధ్యక్షుఁడయిన యతనితమ్ముని గోవిందరాజును, వారి బంధువులను, తదితర ప్రభువరులను, దండనాధులను నెల్లవారిని రప్పించి కొలువుదీర్చి తిమ్మరుసు మొగముగాంచి యిట్లని పలికెనఁట!

"నిన్ను ప్రాణమిత్రునిగా నెప్పుడును జూచుకొనుచున్నాను. నీవు నాకిచ్చిన యీరాజ్యమున కంతకును నీవేపాలకుఁడవుగా నుంటివి. అయిన నందులకు విశ్వాసముఁ జూపఁజాలను. ఎందుకన నీకు విధ్యుక్తమైన కార్యమును నేఱవేర్చుట యందు మాకుఁ బ్రతికూలముగా వర్తించితివి. నీప్రభువగు నాయన్నగారు నానేత్రములను తీయించి వేయవలసిపదని నీకాజ్ఞ చేసినప్పుడు వారియాజ్ఞకు నీవు లోఁబడవలసినవాఁడవై యుండియు నాయనయాజ్ఞను జెల్లింపలేదు. ఆతనికి విధేయుఁడవునుగాలేదు. మీదుమిక్కిలి మేకకన్నులుపెఱికించి తెప్పించి చూపి మోసపుచ్చినాఁడవు. అందువలన నీవును నీతనయులును రాజుద్రోహులైరి. ఇప్పుడు నాతనయునకు విషముపెట్టి చంపినారని తెలిసినది. అందుకొఱకే మిమ్ములను జెఱసాలలో ఖైదీలనుగాఁ జేసెద" నని చివాలునలేచి వారలంబట్టుకొని తనకును తనరాజ్యమునకు నేయపాయముఁ గలుగకుండ బోర్చుగీసు వారిని తోడ్పడుమని ప్రార్థించెనఁట !

ఇట్లు తిమ్మరుసు తమ్మునితోడను కొడుకుతోడను బట్టువడి చెఱసాలం ద్రోయంబడియెనఁట ! కాని త్రిమ్మరుసు కొడు