పుట:Thimmarusumantri.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశమప్రకరణము

137


రాయలు లేఁడని తలంపవలసినదే. కృష్ణదేవరాయని రక్షించినవాఁడు తిమ్మరుసు ; కృష్ణదేవరాయనికి రాజ్యమిప్పించినవాడు తిమ్మరుసు ; కృష్ణదేవరాయని దిగంతవిశ్రాంతయశస్కుని గావించినవాఁడు తిమ్మరుసు ; అట్టితిమ్మరుసు తెలుఁగుదేశమునఁ బుట్టినవాని కెవ్వనికిఁ బూజ్యుఁడుగాక యుండును ?

అంత్యదశ

శ్రీకృష్ణదేవరాయనికి వాంఛలన్నియుఁ దీఱినవెనుక నొకదుర్బుద్ధిపుట్టెను. తాను బ్రదికియుండఁగాఁ దనకుమారుఁడు పట్టాభిషిక్తుఁడు గావలయునని తలంచెను. తనమరణానంతరము తన తమ్ముఁడుగాని, తనయన్నకొడుకుగాని తన కొడుకును దఱిమివేసి సింహాసన మాక్రమించుకొందురన్న భయము జనించెను. తిమ్మరుసుగాని, తిమ్మరుసుతమ్ముఁడుగాని వానిబంధువర్గముగాని తనకుమారునకుఁ దోడ్పడ కున్నయెడల రాజ్యము తనకుమారునకుఁ దక్కదను సందేహముపుట్టెను. తిమ్మరుసునెడ నిర్హేతుకముగా నవిశ్వాస మంకురించెను. దేశమంతయుఁ దిమ్మరుసుపలుకుఁబడిలోనుండెను. తిమ్మరుసుబంధువులు, మిత్రులు ననేకలు గొప్పపదవులలోనుండిరి. వారి ప్రాపులేకున్నఁ దనకొడుకు పట్టాభిషిక్తుఁడగుట సంభవింపదని తలపోసెను. ఇట్లు తలపోసినకొలది ననుమానపిశాచము హృదయమును నానావిధముల బాధింపమొదలుపెట్టెను. ఇట్లు తలపొసి తలపోసి యొకనిశ్చయమునకు రాఁగలిగెను. ఇట్లు కుటిల